బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు అనేది 14 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమయ్యింది. కానీ ఈ 14 మందిలో కనీసం 10 మంది కంటెస్టెంట్స్ కూడా ప్రేక్షకులకు ముందు నుండి సరిగా తెలియదు. సీరియల్ నటీనటులు, మోడల్స్, సింగర్స్, యూట్యూబర్స్, సీనియర్ నటీనటులు.. ఇలా అన్ని కేటగిరిల నుండి వచ్చిన కంటెస్టెంట్స్.. బిగ్ బాస్ 14లో ఉన్నారు. అందులో ఎక్కువమంది ప్రేక్షకులకు తెలిసిన వ్యక్తి ఎవరు అంటే శివాజీ అనే చెప్పుకోవాలి. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శివాజీ.. పలు చిత్రాల్లో హీరోగా కూడా చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సినిమాల పరంగా శివాజీకి గ్యాప్ వచ్చినా.. బిగ్ బాస్‌తో మరోసారి ఆడియన్స్‌ను పలకరించాడు. కానీ బిగ్ బాస్‌ ద్వారా అసలు శివాజీ అంటే ఏంటి, అతడి మెంటాలిటీ ఏంటి అని ప్రేక్షకులకు అర్థమవుతోంది. బిగ్ బాస్ హౌజ్‌లో పిల్ల గ్యాంగుతో గ్రూపు రాజకీయాలు మొదలుపెట్టేశాడు శివాజీ. అంతేకాదు, శివాజీ ఆ హౌస్‌లో ఎక్కడా కంటెస్టెంట్‌గా కనిపించడం లేదని, గెస్టుగా వచ్చినట్లున్నాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఒక్క పని కూడా చేయని శివాజీని అడిగే దమ్ము కూడా కంటెస్టెంట్లకు లేదని, దీంతో ఆయన అజమాయిషీ సాగుతోందని అంటున్నారు.


మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్‌కు ఎంటర్‌టైన్మెంట్ కోసం ఏ విధమైన సోర్స్ ఉండదు. వారితో వారే మాట్లాడుకోవాలి, గొడవపడాలి, మళ్లీ కలిసిపోవాలి. అందుకే బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు కూడా. అలా గ్రూపులు ఫార్మ్ అవుతాయి. స్ట్రాంగ్‌గా ఉన్న గ్రూపు.. వీక్‌గా ఉన్న గ్రూపుపై పెత్తనం సాధిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీ కూడా ఒక గ్రూపును ఫార్మ్ చేసుకున్నాడు. ఆ గ్రూపుకు తనే లీడర్ అని ఫీల్ అవుతున్నాడు. అంతే కాకుండా అందులో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తనే లీడర్ అనే ఫీల్ అయ్యేలా చేస్తున్నాడు. శివాజీ గ్రూపులో ప్రస్తుతం రతిక, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఈ ముగ్గురికీ ఎవరూ సపోర్ట్ చేయకపోయినా సరే.. శివాజీ మాత్రం సపోర్ట్ చేస్తాడు. వారికి సపోర్ట్ చేయని వారిని ఎదిరిస్తాడు కూడా. ఇప్పటికీ ఎన్నో సందర్భాల్లో ఇది ప్రూవ్ అయ్యింది కూడా.


బిగ్ బాస్ రియాలిటీ షోలో టాస్కులు ఆడడం మాత్రమే కాదు.. అందరితో కలిసిపోవాలి, ఇంటి పనుల్లో సాయం చేయాలి. ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడంతో పాటు మెదడుకు కూడా పనిచెప్పాలి. అలా మెదడు ఉపయోగించాల్సిన ప్రతీ టాస్కులో శివాజీ.. కాస్త ఎక్కువగానే ఉపయోగిస్తూ విజయం సాధిస్తున్నాడు. అంతే కాకుండా టీమ్ గేమ్స్‌లో తనంతట తానుగా ముందుకు వచ్చి లీడర్‌షిప్‌ను చూపిస్తున్నాడు. దీంతో శివాజీనే ఆటకు సూత్రధారి అన్న ఫీలింగ్ వస్తోంది. ఇక ఇంటి పనుల విషయానికొస్తే.. శివాజీ అసలు ఎప్పుడూ కిచెన్‌లోకి అడుగుపెట్టినట్టు కానీ, క్లీనింగ్‌లో సాయం చేసినట్టు కానీ కనిపించలేదు. కిచెన్‌లో అందరూ వంట చేస్తున్నా కూడా అటు ఇటు తిరుగుతూ.. మిగిలినవారితో టైమ్ పాస్ చేస్తుంటాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న అందరికంటే శివాజీ వయసులో పెద్ద కాబట్టి తనను ఎవరూ ఏమీ అనడానికి ముందుకు రావడం లేదు.


ఇక బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయిన రోజు నుండే పల్లవి ప్రశాంత్‌కు ఫేవర్‌గా మాట్లాడడం మొదలుపెట్టాడు శివాజీ. ఆ తర్వాత బిడ్డ అని పిలుస్తూ రతికకు క్లోజ్ అయ్యాడు. తాజాగా రతిక, యావర్ రిలేషన్‌షిప్ గురించి నాగార్జున అన్నప్పుడు శివాజీ రియాక్ట్ అయిన పద్ధతి రతికకు నచ్చలేదు. దీంతో మొదటిసారి శివాజీ గురించి వెనుక మాట్లాడింది రతిక. హౌజ్‌లో ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటూ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాడని రతిక కామెంట్స్ చేసింది. మైండ్ టాస్కుల విషయంలో శివాజీ రూటే సెపరేటు అని ఇప్పటికే ప్రూవ్ చేశారు. అందరు ఒక స్ట్రాటజీతో ఆడుతుంటే.. శివాజీకి మాత్రం సెపరేట్ స్ట్రాటజీ ఉంటుంది. ఇదే విధంగా స్మార్ట్‌గా ఆడితే.. శివాజీ కచ్చితంగా టాప్ 5కు కూడా వెళ్లే ఛాన్స్ ఉందని పలువురు ప్రేక్షకులు భావిస్తున్నారు. 


Also Read: దిల్ రాజు చేతికి 'యానిమల్' రైట్స్ - ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial