గురక.. ఈ పేరు చెప్తే వింటే గురక పెట్టేవాళ్ళ కంటే వాళ్ళ పక్కన పడుకునే వారికి భయంగా ఉంటుంది. ఎందుకంటే గురక పెట్టేవారికి వాళ్ళకి ఆ సంగతి తెలియదు కనుక హాయిగా నిద్రపోతున్నామని అనుకుంటారు. కానీ పక్కన పడుకున్న వాళ్ళ నిద్రని హరించి వేస్తున్నారని గ్రహించరు. ఇది చిన్న సమస్య అనుకుంటారు కానీ నిజానికి ఇది ప్రాణాలు తీసేంత పెద్దదే. ప్రతి ఐదుగురిలో ఒకరు గురక పరిస్థితి అదేనండీ స్లీప్ అప్నియాతో బాధపతుడున్నారు. గురక వల్ల నిద్రలో శ్వాస పదే పదే ఆగిపోతుంది. దాదాపు 85 శాతం మందికి దీని గురించి కూడా తెలియదు. చికిత్స చేయకుండా వదిలేస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30 శాతం ఎక్కువగా ఉంటుంది. స్ట్రోక్ వచ్చే అవకాశం 60 శాతం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ది బెటర్ స్లీప్ క్లినిక్ నిపుణులు చెప్పిన దాని ప్రకారం కొంతమంది నిద్రపోతున్నప్పుడు గంటకు 60 సార్లు శ్వాస తీసుకోవడం ఆపేస్తారు. pపక్కన నిద్రపోతున్న వాళ్ళ ద్వారా గురక పెట్టె వారికి వాళ్ళ పరిస్థితి తెలుస్తుంది. పగటి పూట బాగా అలిసిపోయినప్పుడు ఇటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలికంగా స్లీప్ అప్నియా పరిస్థితి ఉంటే వారికి కరొనరీ హార్ట్ డీసీజ్, డిప్రెషన్, స్ట్రోక్, గుండె ఆగిపోయే ప్రమాదం 140 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ కు కూడా దారి తీస్తుంది. మరి కొంతమందికి అయితే చిత్త వైకల్యం ముందుగానే రావచ్చు. కారు నడిపే వారికి ఈ సమస్య ఉంటే యాక్సిడెంట్ల వల్ల కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
నిద్రపోతున్నప్పుడు వాయు మార్గం సహజంగానే ఇరుకుగా ఉంటుంది. కొంతమందిలో ఇది గాలి ప్రవాహం మీద ప్రభావం చూపిస్తుంది. మృదు కణజాలాలు కంపించేలా చేసి గురకకు కారణమవుతుంది. స్లీప్ అప్నియా పరిస్థితిలో వాయు ప్రసరణ పరిమితం అవుతుంది. లేదా ఒక్కొక్కసారి వాయు మార్గంపూర్తిగా మూసుకుపోతుంది. ఊబకాయం, మద్యపానం, ధూమపానం, థైరాయిడ్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. ఇటువంటి పరిస్థితి పురుషులలో సాధారణంగా కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్ది ప్రమాదం పెరుగుతుంది. పెద్దగా గురక పెట్టడం, నోరు పొడిబారిపోవడం, ఉదయం తలనొప్పితో లేవడం వంటి సంకేతాలు స్లీప్ అప్నియా లక్షణాలు.
గురక తగ్గించుకోవడం ఎలా?
తమ వద్దకు ఎక్కువగా జంటలు గురక వల్ల ఇబ్బంది పడుతున్నామని వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. పరిస్థితి చేయి దాటితే గురక వల్ల విడాకులు తీసుకుంటున్న కేసులు నమోదు అవుతున్నాయి. అటువంటి పరిస్థితిని తగ్గించేందుకు CPAP ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒక యంత్రాన్ని ఉపయోగించి బాధితులకు చికిత్స చేయడం జరుగుతుంది. నిద్రపోతున్నప్పుడు సజావుగా శ్వాస తీసుకోవడం కోసం గాలి ఒత్తిడిని అందించేందుకు ముక్కుకి ఒక గొట్టం లాంటిది అమరుస్తారు. దీని ద్వారా గురక రాకుండా ప్రశాంతమైన నిద్రని ఇస్తుంది. వాచ్ లాంటి పరికరం, ఫింగర్ ప్రోబ్, ఛాతీ ప్యాడ్ తో గురక పెట్టె వారి శబ్దాలని రికార్డు చేశారు. కొంతమంది తమ భాగస్వామి గురక వాషింగ్ మెషీన్ శబ్దంలా ఉందని, ట్రైన్ శబ్దంలా ఉందని చెప్పుకొచ్చారు. వారికి ఈ CPAP యంత్రం ద్వారా చికిత్స చేసినట్టు తెలిపారు.