పులి కోసమే చూస్తున్నా -రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు


తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని కనిపించకుండా చేస్తానని, ఆ పార్టీని 100 మీటర్ల లోతున గొయ్యి తీసి పాతిపెడతానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం (జనవరి 21) లండన్ లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇంకా చదవండి


ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్


తమ ఉద్యోగులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సిబ్బందికి ప్రమాద బీమా పెంపుపై యూబీఐతో TSRTC ఒక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం రూ.40 లక్షల నుంచి రూ. ఒక కోటికి ప్రమాద బీమా పెరిగింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో శనివారం ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (VC Sajjanar), యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. ఇంకా చదవండి


టీడీపీ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాంతాలతో కొత్త జిల్లా


పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లా ఉండాలని టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే  జిల్లాను ప్రకటిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అరకులో రా కదలిరా బహిరంగసభలో మాట్లాడారు. పోలవరం ప్రాంతం ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా, మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఆయా ప్రాంత గిరిజనులు ప్రస్తుతం జిల్లా కేంద్రమైన పాడేరుకు కార్యాలయ పనుల కోసం రావాలంటే కనీసం 200 కిలో మీటర్లకు పైగా ప్రయాణించాల్సి రావడం కష్టమవుతోంది. అందుకే గిరిజనులు కొంత కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ను తీరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంకా చదవండి


వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్‌లోకి


ఏపీ కాంగ్రెస్ కొత్త బాస్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇడుపుల పాయ YSR ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి YS Sharmila నివాళులు అర్పించారు. వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. ఆమెతో పాటు ఘాట్ వద్దకు వెళ్లి కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు వైఎస్సార్ (YSR) కు నివాళులు అర్పించారు. మాజీ మంత్రి అహ్మదుల్ల ఘాట్ వద్ద APCC చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ అభిమానులతో YSR ఘాట్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఇంకా చదవండి


ప్రాణ ప్రతిష్ఠ రోజున బిజీబిజీగా ప్రధాని మోదీ


జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు ఆ రోజు ప్రధాని షెడ్యూల్‌ని అధికారికంగా వెల్లడించారు. మధ్యాహ్నం 12.05 గంటలకు ఆయన పూజకు హాజరవుతారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైన తరవాత ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆ తరవాత మధ్యాహ్నం 1 గంటకు ఓ పబ్లిక్ మీటింగ్‌కి హాజరవుతారు. 2.15 నిముషాలకు కుబేర్ తిలలోని శివాలయాన్ని సందర్శిస్తారు. ఉదయం 10.25 నిముషాలకు ప్రధాని మోదీ అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. రామజన్మభూమి ఆలయానికి 10.55 నిముషాలకు చేరుకుంటారు. ఇంకా చదవండి


అయోధ్యకు చేరుకున్న 400 కేజీల భారీ తాళం


చరిత్రాత్మక ఘట్టానికి మరొకొన్ని గంటలే ఉన్నాయి. అందరి అడుగులు అయోధ్యలోని రామమందిరంవైపు వడివడిగా పడుతున్నాయి. ఒక్క అయోధ్య మాత్రమే కాదు.. దేశం మొత్తం రాముని నామస్మరణతో మారుమోగిపోతోంది. ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సంబంధించి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరి 22న బాలరాముడిని ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు రాములోరి గుడి తలుపుకు తాళం వచ్చేసింది. ఇంకా చదవండి


ప్రభాస్‌ 'సలార్‌ 2'లో అక్కినేని హీరో? క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ భార్య


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆయన ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హిట్‌ను అందించింది ‘సలార్’. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ గత డిసెంబర్‌లో విడుదలైన మాసీవ్‌ హిట్‌ అందుకుంది. కలెక్షన్ల విషయంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ఇక విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. దీంతో మళ్లీ సలార్‌ మేనియా మొదలైంది. ఈ క్రమంలో పార్ట్‌ 2 చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే ‘సలార్’కు రెండు భాగాలు ఉంటాయని దర్శకుడు ప్రశాంత్ నీల్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడం పార్ట్‌ 2పై భారీ అంచనాల నెలకొన్నాయి. ఇంకా చదవండి


రష్మిక మందన్న డీప్‌ ఫేక్‌ వీడియో.. ప్రధాన నిందితుడు అరెస్ట్‌


డీప్‌ ఫేక్‌ వీడియో.. సోషల్‌ మీడియాలో అప్పట్లో ఆందోళన కలిగించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌కి సంబంధించి ఆందోళన నెలకొంది ఆ వీడియో చూసిన తర్వాత. కాగా.. ఇప్పుడు ఆ కేసులో కీలక విషయం చోటు చేసుకుంది. వీడియోను క్రియేట్‌ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీడియో సృష్టించిన ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించిన ఢిల్లీ పోలీసులు.. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా చదవండి


ఇంటి ఓనర్‌ పాన్ ఇవ్వకపోయినా HRA క్లెయిమ్‌ చేయొచ్చు


మన దేశంలో, ఆదాయ పన్ను కడుతున్న లక్షలాది మంది ప్రజలు (Taxpayers), సొంత ఊర్లను & ఇళ్లను వదిలి ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. అలాంటి వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ‍‌(Income Tax Act) కింద, అద్దెగా చెల్లించిన డబ్బుపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, కొన్ని షరతులకు లోబడి ఇది జరుగుతుంది. ITRలో HRA (House Rent Allowance)ను క్లెయిమ్ చేస్తున్న చాలామందికి, వారి ఇంటి యజమాని పాన్‌ (PAN Card) వివరాలు తెలీవు. సాధారణంగా, పాన్‌ నంబర్‌ ఇవ్వడానికి హౌస్‌ ఓనర్‌ నిరాకరిస్తాడు. లేదా, ఇంటి ఓనర్‌కు పాన్‌ కార్డ్‌ ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ HRA క్లెయిమ్ చేయవచ్చు. ఇంకా చదవండి


మరో పెళ్లి చేసుకున్న షోయబ్‌ మాలిక్‌.. సానియా పోస్ట్‌ అర్థం అదేనా?


ప్రముఖ స్టార్‌ టెన్నీస్‌ ప్లేయర్‌, పాకిస్తాన్‌ జట్టు మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌.. గత కొద్ది రోజులుగా వీళ్ల గురించి వార్తలు తెగ వినిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్‌ బయటికి వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూరుస్తూ షోయబ్‌ ఫొటోలు షేర్‌ చేయడం గమనార్హం. అవే ఆయన పెళ్లి ఫొటోలు. పాకిస్తానీ నటి సనా జావేద్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇంకా చదవండి