YS Sharmila reveals why she joins Congress: ఇడుపులపాయ: ఏపీ కాంగ్రెస్ కొత్త బాస్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇడుపుల పాయ YSR ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి YS Sharmila నివాళులు అర్పించారు. వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. ఆమెతో పాటు ఘాట్ వద్దకు వెళ్లి కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు వైఎస్సార్ (YSR) కు నివాళులు అర్పించారు. మాజీ మంత్రి అహ్మదుల్ల ఘాట్ వద్ద APCC చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ అభిమానులతో YSR ఘాట్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.


రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుంటాం.. 
ఆదివారం (జనవరి 21న) ఉదయం విజయవాడ లో APCC చీఫ్ గా భాద్యతలు తీసుకుంటున్నానని వైఎస్ షర్మిల అన్నారు. తండ్రి ఆశీర్వాదం కోసం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చానన్నారు.  వైఎస్సార్ కి కాంగ్రెస్ పార్టీ, పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానమని పేర్కొన్నారు. సిద్ధాంతాల కోసం వైఎస్సార్ ఎంత దూరం అయినా వెళ్ళే నేత అని తెలిపారు. నేడు దేశంలో సెక్యులరిజం అనే పదానికి, ఫ్యూలరిజం అనే పదాలకు అర్థం లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు.  భారత దేశానికి మళ్ళీ మంచి జరగాలి అంటే వైఎస్సార్ ఆశయాలు అన్ని సిద్ధించాలని ఆకాంక్సించాలి. వైఎస్సార్ నమ్మిన సిద్ధాంతం కోసం నేను పార్టీలో ఆఖరి వరకు నిలబడతానని స్పష్టం చేశారు. వైఎస్సార్ కోరుకున్నట్లు రాహుల్ గాంధీ ని ప్రధాని చేసే వరకు పోరాటం ఆగదు అని తన భవిష్యత్ కార్యాచరణను తెలిపారు.


కాంగ్రెస్ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరరావు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌ పార్టీకి దిక్సూచిలా పనిచేశారంటూ తన మిత్రుడు వైఎస్సార్ సేవల్ని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో వైఎస్సార్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. వైఎస్సార్ ఆశయాల కోసం రాజన్న బిడ్డ షర్మిల కాంగ్రెస్‌లో చేరారని చెప్పారు. కొన్ని పార్టీలు బానిసలు అయి ఉండొచ్చు అంటూ మాజీ మంత్రి రఘువీరారెడ్డి మీడియాతో అన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం షర్మిల పనిచేస్తారని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసే వరకు పార్టీ నేతలందరం కలిసి పనిచేస్తామన్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత తొలిసారి కడప జిల్లాకు వచ్చిన షర్మిలకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి అహ్మదుల్లా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్‌నేతలు శైలజానాథ్‌, తులసిరెడ్డి తదితరులు షర్మిల వెంట ఉన్నారు.


వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టాక రాష్ట్రంలో అన్న జగన్, వర్సెస్ చెల్లెలు గా పాలిటిక్స్ మారతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ అభిమానులు అటు వైఎస్సార్ సీపీలో కొనసాగుతారా, లేక షర్మిల వెంట వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.


Also Read: టీడీపీ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాంతాలతో కొత్త జిల్లా - అరకులో చంద్రబాబు ప్రకటన