అట్లీ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా - నిర్మాతగా త్రివిక్రమ్!

పవన్ కళ్యాణ్, అట్లీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కునున్నట్లు లేటెస్ట్ ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Continues below advertisement

Pawan Kalyan, Atlee, and Trivikram to collaborate for a film : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో పవన్ సినిమా షూటింగ్స్ సైతం పక్కన పెట్టి తన పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించారు. ఆమధ్య రాజకీయాలు, షూటింగ్స్ రెండిటికీ సమయం కేటాయించిన పవన్ ఇప్పుడు మాత్రం షూటింగ్స్ ని పూర్తిగా పక్కన పెట్టేసాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు.. వంటి వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. ఈ మూడు సినిమాలు ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.

Continues below advertisement

పవన్ పాలిటిక్స్ నుంచి ఎప్పుడు ఫ్రీ అవుతారో అని నిర్మాతలు ఆయన కాల్ షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ ఖాతాలో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు వర్క్ చేరింది. ఈ క్రేజీ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అట్లీ - పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో లో ఓ సినిమా తెరకెక్కబోతోందట. ఈ ప్రాజెక్టుకి త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కమిట్ అయిన సినిమా షూటింగ్స్ ని పూర్తి చేయని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సినిమాని ఓకే చేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజకీయాల వల్ల పవన్ సినిమా షూటింగ్స్ కి తాత్కాలికంగా తీసుకున్నాడు.

ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే ఒప్పుకున్న సినిమాలను ఫాస్ట్ గా పూర్తి చేయాలని భావిస్తున్నారట పవన్ కమిటీ అయిన సినిమాల్లో ముందుగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న 'OG' షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' వంటి సినిమాలకు డేట్స్ కేటాయించనున్నాడు. ఈ ప్రాజెక్టులన్ని పూర్తయ్యాకే పవన్ కళ్యాణ్ అట్లీతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని త్రివిక్రమ్ తో పాటు మరో నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత ఏడాది షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన 'జవాన్' తో భారీ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న అట్లీ తన నెక్స్ట్ మూవీ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయాల్సి ఉంది.

బన్నీ తో ప్రాజెక్టు పూర్తయ్యాకే పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. కమర్షియల్ అంశాలకు ఓ సామాజిక సందేశాన్ని జోడించి సినిమాలు తీయడం అట్లీ స్టైల్. ఈ యంగ్ డైరెక్టర్ షారుక్ ఖాన్ తో తీసిన జవాన్ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యికోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అట్లీ సినిమా చేయబోతున్నాడనే విషయం బయటకు రావడంతో ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ కాంబినేషన్ కనుక పట్టాలెక్కితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

Also Read : లగ్జరీ కారు కొనుగోలు చేసిన తమిళ స్టార్ డైరెక్టర్, ధర ఎంతో తెలుసా?

Continues below advertisement