AR Murugadoss New Car: తెలుగు, తమిళ సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలతో అద్భుత సినిమాలను తెరకెక్కించిన మురుగదాస్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020లో రజనీకాంత్ తో కలిసి తెరకెక్కించిన చిత్రం ‘దర్బార్‘. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అటు త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘రాంగి‘ సినిమాకు కథను అందించారు. ‘ఆగష్టు 16, 1947‘ అనే పిరియాడికల్ డ్రామాను నిర్మించారు. ప్రస్తుతం తమిళ నటుడు శివకార్తికేయన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.

  


లగ్జరీ కారును కొనుగోలు చేసిన మురుగదాస్


తాజాగా దర్శకుడు AR మురుగదాస్ BMW కంపెనీకి చెందిన ఖరీదైన, లగ్జరీ కారును కొనుగోలు చేశారు. BMW X7  మోడల్ ను తీసుకున్నారు. తాజాగా తన కొత్త కారును షో రూమ్ నుంచి డెలివరీ తీసుకుంటూ దిగిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ కారు ఖరీరు రూ. 1.30 కోట్లు ఉంటుందని సమాచారం. తాజాగా ఇదే మోడల్ కారును తమిళ స్టార్ హీరో రజనీకాంత్ అందుకున్నారు. ‘జైలర్’ సక్సెస్ తర్వాత సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ రజనీకాంత్‌కు  బహుమతిగా ఇచ్చారు. ఇప్పటికే ఈ ఖరీదైన BMW SUV కారు యామీ గౌతమ్, షాహిద్ కపూర్, భారతీ సింగ్, కరీనా కపూర్ ఖాన్, సర్గున్ మెహతా, అజయ్ దేవగన్ సహా పలువురు ప్రముఖుల దగ్గర ఉంది.  






నాలుగేళ్ల  తర్వాత సినిమా చేస్తున్న మురుగదాస్


ఇక తమిళ సినీ పరిశ్రమలో 'గజిని', 'తుపాకీ', 'కత్తి' లాంటి ఇండస్ట్రీ హిట్స్ అందించిన మురగదాస్, ప్రస్తుతం శివ కార్తికేయన్ సినిమా చేస్తున్నారు. ‘అయలాన్’ మూవీ తర్వాత స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో శివ కార్తికేయన్ సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మురగదాస్ 2020లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో 'దర్బార్' అనే సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు మరే చిత్రానికి దర్శకత్వం వహించలేదు. సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత మురగదాస్ తన తదుపరిచిత్రాన్ని శివ కార్తికేయన్ తో ప్రకటించారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైట్ హౌస్ మూవీస్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషతోపాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మూవీ టీం త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.


Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘నా సామిరంగ’ దూకుడు, 6 రోజుల్లో ఎంత వసూళు చేసిందంటే?