Naa Saami Ranga Worldwide Box Office Collection Day 6: టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. జనవరి 14న ప్రేక్షకుల ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నది. ప్రస్తుతం బాక్సాపీస్ దగ్గర సత్తా చాటుతోంది.  


6 రోజుల్లో రూ. 38.5 కోట్లు వసూళు చేసిన ‘నా సామిరంగ’  


‘నా సామిరంగ‘ సినిమాకు సంక్రాంతి సెలవులు బాగా కలిసి వచ్చాయి. అదే సమయంలో ఈ చిత్రంలో ఫ్యామిలీ, ఎమోషన్ కలగలిపి ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి వసూళ్లు అందుకుంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా బాగా ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచే నా సామిరంగ మూవీ 6 రోజుల్లో రూ.19.43 కోట్ల షేర్ రాబట్టింది. ‘నా సామిరంగ’ మూవీ ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.  


తెలుగు రాష్ట్రాల్లో ‘నా సామిరంగ’ 6వ రోజు కలెక్షన్స్


నైజాంలో – 22 లక్షలు


సీడెడ్ – 24 లక్షల


వైజాగ్ – 26 లక్షలు


ఈస్ట్ – 18 లక్షలు


వెస్ట్ – 11లక్షలు


కృష్ణ – 9 లక్షలు


గుంటూరు – 11 లక్షలు


నెల్లూరు – 6లక్షలు


6వ రోజు షేర్ – 1.2 కోట్లు


6 రోజుల్లో  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల షేర్– 19. 43 కోట్లు


వరల్డ్ వైడ్ గ్రాస్ – 38.5 కోట్లు






నాగార్జునకు కలిసి వచ్చిన సంక్రాంతి సెంటిమెంట్


గత కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న నాగార్జునకు సంక్రాంతి సెటిమెంట్ కలిసి వచ్చింది. ‘నా సామిరంగ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. వాస్తవానికి సంక్రాంతికి నాగార్జున సినిమా విడుదల అయ్యిందంటే పక్కి సక్సెస్ అవుతుందనే టాక్ ఉంది. ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో మరోసారి నిజమేనని వెల్లడైంది.  ‘ది ఘోస్ట్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఆయన, ఈ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు.  


నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో ‘నా సామిరంగ’ సినిమా తెరకెక్కింది. అషికా రంగనాథ్ హీరోయిన్‌గా కనిపించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. 'పలాస' దర్శకుడు కరుణ కుమార్ ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఆస్కార్ విన్నర్స్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.    


Read Also: ‘సింగపూర్ సెలూన్‘లో లోకేష్ కనగరాజ్, మరో కొత్త సబ్జెక్ట్‌తో వస్తున్న ‘అమ్మోరుతల్లి’ హీరో