Sania Shoaib Divorce: ప్రముఖ స్టార్ టెన్నీస్ ప్లేయర్, పాకిస్తాన్ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్.. గత కొద్ది రోజులుగా వీళ్ల గురించి వార్తలు తెగ వినిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్ బయటికి వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూరుస్తూ షోయబ్ ఫొటోలు షేర్ చేయడం గమనార్హం. అవే ఆయన పెళ్లి ఫొటోలు. పాకిస్తానీ నటి సనా జావేద్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు.
మూడో పెళ్లి?
హైదరాబాద్‌కు చెందిన స్టార్ టెన్నీస్ ప్లేయర్ సానియా, పాకిస్తాన్‌కి చెందిన షోయబ్ ఇద్దరు 2010లో వివాహం చేసుకున్నారు. వాళ్ల ప్రేమకు గుర్తుగా 2018లో కొడుకు జన్మించాడు. అయితే, గత కొన్ని రోజులుగా వాళ్లు ఇద్దరు విడిగా ఉంటున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కొడుకు పుట్టిన రోజున కూడా సానియా, షోయబ్ ఇద్దరు అంటీ ముట్టనట్లుగా కనిపించారు. దీంతో వాళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇప్పుడు షోయబ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించి ఫొటోలు షేర్ చేశారు. అయితే, ఇది షోయబ్‌కి మూడో పెళ్లి అట. సానియాని వివాహం చేసుకునే కంటే ముందే షోయబ్ అయేషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకుని అదే ఏడాది సానియాని వివాహం ఆడినట్లు వార్తలు వచ్చాయి.
రెండు రోజుల క్రితం హార్ట్‌బ్రేకింగ్ పోస్ట్
విడాకుల వార్తల నేపథ్యంలో రెండు రోజుల క్రితం సానియా మీర్జా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. "వివాహ బంధం అత్యంత క్లిష్టమైంది. విడాకులు కూడా అంతే కష్టమైనవి. ఇందులో ఏది అత్యంతకరమైన ఇబ్బందో మీరే తెలుసుకోండి. ఒబేసిటీ హార్డ్.. ఫిట్‌గా ఉండటం కూడా అంతే కష్టం. ఇందులో ఏది ఎన్నుకుంటారు? అప్పుల్లో కూరుకుపోవడం కష్టంగా తోస్తుంది. అదే సమయంలో ఆర్థికంగా క్రమశిక్షణగా ఉండటం కూడా అలానే అనిపిస్తుంది ఇందులో ఏం కావాలో ఎంచుకోండి. కమ్యూనికేట్ చేయడం, కమ్యూనికేట్ చేయకుండా రెండూ కష్టమే. ఇందులో ఏది అత్యంత కష్టమో మీరే ఎంచుకోండి. జీవితం నల్లేరు మీద నడకలాంటిది. ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. అయితే, అందులో మనకేది కావాలో మనం తెలివిగా ఎంచుకోవాలి". అంటూ ఎమోషనల్, హార్ట్‌బ్రేకింగ్ పోస్ట్ పెట్టింది సానియా. షోయబ్ మాలిక్, మరో నటితో కలిసి క్లోజ్‌గా జరిగిన ఫోటో షూట్ తర్వాత సానియా ఈ పోస్ట్ పెట్టారు.
ఇక ఇప్పుడు ఆమె పోస్ట్ పెట్టిన రెండు రోజులకే షోయబ్ తన పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. "జంటగా మేము ఇలా" అంటూ హార్ట్ సింబల్స్‌ని పోస్ట్ చేశారు ఆయన. దీంతో అవి ఏవైనా యాడ్ షూట్ ఫొటోలేమో అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. మరికొందరేమో.. ఇప్పటికైనా క్లారిటీ ఇచ్చారా అంటున్నారు. కాగా.. సానియా, షోయబ్‌ల పెళ్లి విషయంలో గతంలో చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తానీని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని చాలామంది అప్పట్లో గొడవ కూడా చేశారు. ఇక ఇప్పుడు ఇలా వాళ్లిద్దరి బంధం ముగిసిపోయిందా అంటూ షోయబ్ ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
Also read: ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్? వరుడు ఎవరంటే..