తెలంగాణలో ముఖాముఖి పోరుకు కాంగ్రెస్ వ్యూహం
తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఇప్పటికైతే త్రిముఖ పోరు ఖాయం. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత మారుతున్న పరిస్థితులతో బీజేపీ రేసు నుంచి వైదొలుగుతోందన్న అభిప్రాయాన్ని బలంగా కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. అధికారికంగా బీజేపీ నుంచి ఒక్క నేత కూడా కాంగ్రెస్ లో చేరకపోయినా చేరికల సునామీ ఉంటుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ముఖాముఖి పోరు ఉంటుందన్న అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ వ్యూహం ఫలించి ముఖాముఖి పోరే జరిగితే.. ఫలితాలు అనూహ్యంగా ఉంటాయన్న అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఇంకా చదవండి
ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగనుందని తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో మొదలైన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించారు. ఇంకా చదవండి
నేడు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్, బహిరంగ సభ కూడా
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు ఆదివారం (జూన్ 4) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో తొలిసారిగా వస్తున్నందున కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగతం పలికేలా సన్నాహాలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు సీఎం నిర్మల్ జిల్లాకు రానుండగా.. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో హెలిప్యాడ్ ను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇంకా చదవండి
తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం దేశంతో పాటు ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. శుక్రవారం రాత్రి జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంత్ పూర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 800కు పైగా బాధితులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ తమకు కావాల్సిన విధంగా సీట్లు రాలేదని, టికెట్లు క్యాన్సిల్ చేసుకున్న ఓ కొత్త జంట విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. రెగ్యూలర్ గా తన మాట మీదనే ఉండేవాడు. కానీ లక్కీగా ఆరోజు భార్య మాట వినడంతో తామిద్దరం ప్రాణాలతో ఉన్నామని చెబుతున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి. ఇంకా చదవండి
తెలంగాణలో ఈవారం ఠారెత్తనున్న ఎండ, ఐఎండీ హెచ్చరిక
ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు దక్షిణ చత్తీస్ గఢ్ మరియు పరిసరాల్లోని తెలంగాణ మీద ఒక ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఏర్పడింది. దీని వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల 7 రోజులు తెలంగాణ రాష్ట్రం అంతటా గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు స్థిరంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా చుట్టు పక్కల 2, 3 జిల్లాలలో రేపు ఎల్లుండి 39 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇంకా చదవండి
అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం పది గంటల సమయంలో ఆయన సీబీఐ ఆఫీసుకు వచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రశ్నించారు. సీబీఐ ఆఫీసుకు వచ్చిన వెంటనే ఆయన వద్ద ఉన్న ఫోన్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని .. విచారణ పూర్తయ్యాక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని ప్రధానంగా వివేకా హత్య జరిగిన రోజున చేసిన వాట్సాప్ కాల్స్ వివరాల గురించి ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. ఇటీవల కోర్టులోనూ ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది సీబీఐ. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేయడంతో.. అవినాష్ రెడ్డికి అరె్ట్ టెన్షన్ లేకపోయింది. అందుకే ఈ సారి హైదరాబాద్ సీబీఐ ఆఫీసు వద్ద పెద్దగా ఆయన అనుచురుల గుమికూడలేదు. ఇంకా చదవండి
అత్యాచార బాధితురాలి జాతకాన్ని కోరిన అలహాబాద్ హైకోర్టు - ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
మాంగళిక(కుజదోషం) ఉందో లేదో నిర్ధారించేందుకు అత్యాచార బాధితురాలి జాతకాన్ని కోరుతూ అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆర్డర్స్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమయంలో ఈ అంశాన్ని విచారించింది. అత్యాచార బాధితురాలి జాతకాన్ని పరిశీలించి తనకు కుజదోషం ఉందో లేదో చెప్పాలని లక్నో యూనివర్సిటీలోని జ్యోతిషశాస్త్ర విభాగం అధిపతిని అలహాబాగ్ హైకోర్టు మే 23న ఆదేశించింది. ఇంకా చదవండి
చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
తెలుగు సినిమా ప్రేక్షకులకు, మెగా అభిమానులకు శనివారం సాయంత్రం పెద్ద షాక్ తగిలింది. ఒకవైపు చిన్న బాధ, మరో వైపు ఆనందం! ఎందుకు అంటే... అగ్ర హీరో స్వయంగా తనకు క్యాన్సర్ వచ్చిందని, ముందుగా గుర్తించడంతో ప్రమాదం తప్పిందని చెప్పినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. చిరుకు క్యాన్సర్ వచ్చిందని తెలిసినా, దాన్నుంచి బయట పడటంతో సంతోషం వ్యక్తం చేశారంతా! అయితే... ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ చాలా మంది ఆయనకు ఫోన్లు చేశారు. దాంతో ఆయన సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. ఇంకా చదవండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్ ఉందేమో చూసుకోండి
ప్రస్తుత వడ్డీ రేట్ల పెంపు సైకిల్‌లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు (RBI Repo Rate) ఇప్పుడు గరిష్ట స్థాయిలో ఉంది. దీనికి అనుగుణంగా కొంతకాలంగా బ్యాంకులు అటు లోన్ రేట్లను, ఇటు డిపాజిట్ రేట్లను పెంచాయి. ముఖ్యంగా, ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆకర్షించడానికి మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేశాయి. ఇప్పుడు, కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని తగ్గించడం ప్రారంభించాయి. ఇంకా చదవండి
సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్ - ఏ విషయంలో అంటే?
ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య ఏకైక టెస్ట్ లండన్‌లోని లార్డ్స్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 11,000 టెస్టు పరుగుల మైలురాయిని అధిగమించాడు. జో రూట్ ఈ సంఖ్యను టచ్ చేసిన రెండో ఇంగ్లీష్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇంగ్లిష్ మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ తొలిసారిగా ఈ సంఖ్యను చేరుకున్నాడు. మరోవైపు జో రూట్ 11,000 పరుగుల మార్క్‌ను దాటడం ద్వారా భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇంకా చదవండి