Avinash Reddy To CBI :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం పది గంటల సమయంలో ఆయన సీబీఐ ఆఫీసుకు వచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రశ్నించారు. సీబీఐ ఆఫీసుకు వచ్చిన వెంటనే ఆయన వద్ద ఉన్న  ఫోన్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని .. విచారణ పూర్తయ్యాక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని ప్రధానంగా వివేకా హత్య జరిగిన రోజున చేసిన వాట్సాప్ కాల్స్ వివరాల గురించి ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. ఇటీవల కోర్టులోనూ ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది సీబీఐ. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేయడంతో.. అవినాష్ రెడ్డికి అరె్ట్ టెన్షన్ లేకపోయింది. అందుకే ఈ సారి హైదరాబాద్ సీబీఐ ఆఫీసు వద్ద పెద్దగా ఆయన అనుచురుల గుమికూడలేదు.


ముందస్తు బెయిల్ షరతుల్లో ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరు కావాలని షరతు                                               


వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్  రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు జూరు చేస్తూ వెకేషన్ బెంచ్ తీర్పునిచ్చింది. అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ పై పలు దఫాలుగా సుధీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం..షరతులతో కూడి బెయిల్ ఇచ్చింది. ప్రతి శనివారం  సీబీఐ విచారణకు హాజరుకావాలని చెప్పింది. అనుమతి లేకుండా దేశం విడిచి పెట్టి వెళ్లరాదని సూచించింది.  వివేక హత్య కేసులో విచారణ నుంచి  అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్టైంది.


జూలై 2 తరవాత  ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టుకు వెళ్లే చాన్స్


ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయి. వెకేషన్ బెంచ్‌లు విచారణ జరుపుతున్నాయి. అత్యవసర కేసులు అయితేనే విచారిస్తారు. అందుకే ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తూ.. సునీత కానీ..సీబీఐ కానీ..  సుప్రీంకోర్టుకు వేసవి సెలవుల తర్వాతనే పిటిషన్లువేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రత్యేక వసతులు                                          


హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేక కేటగిరి విచారణ ఖైదీగా చూడాలని సీబీఐ కోర్టు సూచించింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు సీబీఐ న్యాయస్థానం శుక్రవారం సాయంత్రం సిఫార్సు చేసింది. ఈ కేసులో ఇదివరకే అరెస్టైన భాస్కర్ రెడ్డి.. తనను ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలన్న ఆయన అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది. ఏప్రిల్ 16 నుంచి ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నారు.