Horoscope Today 4th June 2023: జూన్ 4 ఆదివారం మీ రాశిఫలితాలు
మేష రాశి
ఈ రోజు పెండింగ్ లో ఉండే మీ పని స్నేహితుల సహకారంతో పూర్తవుతుంది. రోజంతా ఏదో పనిలో బిజీగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది.
వృషభ రాశి
ఈ రాశివారు భయపెట్టే సంఘటనల గురించి ఆలోచించవద్దు. ఆర్థిక మూలాలు పెరుగుతాయి. ఒకరి ప్రవర్తన మిమ్మల్ని అసంతృప్తికి గురి చేస్తుంది. ఒత్తిడికి దూరంగా ఉండండి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి . పిల్లలతో సమయం గడపడం ముఖ్యం. కొన్ని విషయాల్లో విమర్శలు ఎదుర్కోకతప్పదు.
మిథున రాశి
ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక స్థితి బావుంటుంది. పాత స్నేహితులను కలుస్తారు..వివాదాలేమైనా ఉంటే వారితో రాజీ పడేందుకు సిద్ధపడేందుకు మంచిరోజు. ఓ అపార్థం మీ మానసిక స్థితిని పాడుచేస్తుంది. యోగా ధ్యానం చేసేందుకు ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కొత్త పనులు ప్రారంభిస్తారు.
కర్కాటక రాశి
ఈ రోజు మీ ఆర్థిక స్థితి బావుంటుంది. మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదిస్తారు. కొత్త బంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులుంటాయి. కొన్ని సమస్యలు ఎదుర్కోకతప్పదు. అనవసర విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. మీ ప్రవర్తనలో కఠినత్వాన్ని తగ్గించుకుంటే మంచిది. అత్యవసరం అయితే కానీ ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.
సింహ రాశి
కొన్ని సమస్యలు మిమ్మల్ని కలత చెందేలా చేస్తాయి. ఆర్థిక ఇబ్బందులుంటాయి కానీ స్నేహితుల సలహాలు మేలుచేస్తాయి. సంబంధాలతో ఆనందం, ప్రేమను అనుభవిస్తారు. వివాదాలకు, వాదనలకు దూరంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. తెలియని వ్యక్తులను దూరంగా ఉంచాలి. వాహన సౌఖ్యం లభిస్తుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
కన్యా రాశి
ఈ రోజు మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవవచ్చు. ధనలాభం పొందే అవకాశం ఉంది. తీసుకున్న అప్పులు చెల్లించగలుగుతారు. మీ సలహాలను కుటుంబ సభ్యులు పాటిస్తారు. ఇష్టమైన రుచికరమైన భోజనం చేయండి. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ఓ ముఖ్యమైన సమాచారం వింటారు. మీ ప్రవర్తనలో మార్పులొస్తాయి.
Also Read: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!
తులా రాశి
ఈ రోజు మీరు విజయం సాధిస్తారు. మీ బలహీనతను బయటపెట్టే ఏ పని చేయకండి. మీ సమయం, డబ్బు వృధా చేసుకోకండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ స్నేహితులను లేదా ప్రియమైన వారిని అనుమానించవద్దు. సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించండి.మీ భాగస్వామి మీపై కోపం తెచ్చుకోవచ్చు. మీ పనిలో తొందరపడకండి, జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి
మీరు ఏదో విషయంలో చికాకుగా ఉంటారు. మీ భవిష్యత్ కి మేలుచేసే తల్లిదండ్రుల మాటలను జాగ్రత్తగా వింటారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. మీ నిజాయితీ, వినయం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఒంటరిగా ఉండేందుకు ఇష్టడతారు. ఉద్యోగులు , వ్యాపారులకు మంచి ఫలితాలున్నాయి. వైవాహిక జీవితం బావుంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు కొనుగోలు చేసిన వస్తువులను ఆనందిస్తారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ప్రయాణం చేయడానికి అంత మంచిది కాదు. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. కోపాన్ని తగ్గించుకోవాలి. విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..ధైర్యంగా ఉండండి.
Also Read: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే
మకర రాశి
ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంతో కలసి ఏదైనా కొత్తపని ప్రారంభిస్తారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీ వ్యాపారం గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు.
కుంభ రాశి
మీ ప్రతికూల ఆలోచన సమస్యలను సృష్టించవచ్చు. మీరు కొత్త వ్యాపార ఒప్పందాల నుంచి డబ్బు పొందుతారు. స్నేహితులను కలుస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు.
మీన రాశి
ఒకరి మాటల్లో కూరుకుపోయి తెలివితక్కువ పనులు చేయకండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఓపికగా ఉండేందుకు ప్రయత్నించండి. కోపాన్ని తగ్గించుకోకుంటే ఇతరులను బాధపెట్టినవారవుతారు. ఈరోజు వివాహితుల జీవితం సాధారణంగా ఉంటుంది. అనవసర వాదనలకు దిగొద్దు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.