గౌరవం ఇవ్వనిచోట ఉండక్కర్లేదు - బీఆర్ఎస్‌లో చేరిన పాల్వాయి స్రవంతి


ఎన్నికల కోసం టికెట్ రాలేదని భంగపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఆదివారం (నవంబరు 12) తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. శనివారం (నవంబరు 11) స్రవంతి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం స్రవంతి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లోకి రావడం సంతోషంగా ఉందని పాల్వాయి స్రవంతి అన్నారు. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదని తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. అందుకే తనకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ లో ఉండాల్సిన అవసరం లేదని, పార్టీ నుంచి బయటకి వచ్చానని చెప్పారు. తన అనుచరులు, కార్యకర్తల భవిష్యత్తును కేటీఆర్ చేతిలో పెడుతున్నామని, తమ భవిష్యత్తుకు అండగా నిలవాలని ఆమె కోరారు. కాంగ్రెస్ లో ముందు నుంచి ఉన్న నేతలను కాదని కొత్తవాళ్లకు పదవులు కట్టబెడుతున్నారని అన్నారు. తాను పదవుల కోసం బీఆర్ఎస్ లో చేరలేదని అన్నారు. ఇంకా చదవండి


పార్టీ, ప్రభుత్వం ఒక్కటేనా - ఏపీలో అన్ని హద్దులు చెరిగిపోయాయా?


వైసీపీ పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) స్పష్టం చేశారు. పార్టీ ప్రచారాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నారని వస్తున్న విమర్శలపై ఆయన ఇలా స్పందించారు. అయితే నిజంగా పార్టీ , ప్రభుత్వం ఒకటేనా అంటే.. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని  చెప్పక తప్పదు. పార్టీ ప్రచారాలను విడిగా చేసుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలుగానే నిర్వహించుకోవాలి. అలాంటి కార్యక్రమాలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ఏపీలో అవేమీ లేవని.. ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారన్న విమర్శలు విపక్షాలు ఎక్కువగా  చేస్తున్నాయి. ఇంకా చదవండి


పండుగ వేళ పెళ్లింట్లో తీవ్ర విషాదం, ఊరేగింపు మీదకి దూసుకొచ్చిన మృత్యువు!


అనంతపురం జిల్లాలో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. ఆత్మకూరు మండలం పంపనూరులో శనివారం అర్ధరాత్రి వివాహ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుండగా బొలెరో వాహనం రూపంలో మృత్యువు దూసుకోచింది. ఆత్మకూరు మండలం పంపనూరులో శనివారం (నవంబరు 11) అర్ధరాత్రి పెళ్లి ఊరేగింపు రోడ్డు దాటుతుండగా కళ్యాణ్ దుర్గం వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఒకసారిగా వారి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి బృందంపై దూసుకు వచ్చిన బొలెరో వాహనం కొద్దిగా ముందుకు వెళ్లి మరో కారును ఢీకొట్టింది. కారు నుజ్జు నుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న రామప్ప, అనిల్, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తి బోనేంద్రతో పాటు ఓ మృతుడు సూరప్ప భార్య లక్ష్మీదేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా చదవండి


మరో రెండు వారాల్లో కొత్త కుట్రలు, రెడీగా ఉండండి - కేటీఆర్


డబ్బు మదంతో వంద కోట్లు ఖర్చు పెట్టి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ గెలవాలని చూస్తున్నాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డి ని ఓడించాలని పిలుపు ఇచ్చారు. మన జీవితాల్లో వెలుగులు నింపిన కేసిఆర్ కావాలా? లేదా కారు చీకట్లు తెచ్చే కాంగ్రెస్ కావాలా? అని అడిగారు. మరోసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.. ఈ పదిహేను రోజుల్లో కొత్త కుట్రలు రాబోతున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం (నవంబరు 12) మునుగోడు కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇంకా చదవండి


అచ్చంపేటలో ఉద్రిక్తత, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి


నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet)లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ (Telangana Congress Party), బీఆర్ఎస్ (BRS) మధ్య ఘర్షణ, ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణలో గువ్వల బాలరాజు (Guvvala Balaraju) నుదిటిపై గాయలు అవడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ వాహనంలో డబ్బుల బ్యాగ్‌లను తరలిస్తున్నారనే సమాచారంతో కాంగ్రెస్ నేతలు వెంబడించారు. ఇంకా చదవండి