Prabhas Salaar Trailer Release Date Time : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు 'సలార్' టీమ్ దీపావళి కానుక అందించింది. సినిమా నుంచి హీరో సరికొత్త స్టిల్ విడుదల చేసింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... గన్ పట్టుకుని స్లిమ్ అండ్ స్టైలిష్ ఫోజులో ప్రభాస్ సూపర్ ఉన్నారు. యాక్షన్ సీక్వెన్స్ నుంచి తీసిన స్టిల్ అని అర్థం అవుతోంది.
'సలార్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే?
Salaar Trailer Release On December 1st 2023 : డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్ విడుదల కానుందని రెండు మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అది నిజమే అని ఈ రోజు క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. ఆ రోజు రాత్రి 7.11 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది.
Also Read : టైగర్ 3 రివ్యూ : దీపావళికి సల్మాన్ యాక్షన్ ధమాకా సౌండ్ చేస్తుందా? సినిమా హిట్టా? ఫట్టా?
థియేటర్లలో కొత్త సినిమాలతో 'సలార్' ట్రైలర్!
రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' డిసెంబర్ 1న విడుదల అవుతోంది. ఆ సినిమాతో పాటు థియేటర్లలో 'సలార్' ట్రైలర్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే, అప్పటికి థియేటర్లలో ఉన్న సినిమాలు, కొత్త సినిమాఅత్తో ట్రైలర్ యాడ్ చేస్తారట.
Also Read : మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?
ప్రభాస్ 'సలార్' వర్సెస్ షారుఖ్ ఖాన్ 'డంకీ'
'సలార్' సినిమా విడుదల ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ డిసెంబర్ 22న థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యింది. అయితే... ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ముందు షారుఖ్ ఖాన్ 'డంకీ' విడుదల తేదీ అనౌన్స్ చేశారు. దాంతో రెండు సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. ఈ క్లాష్ కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. హిందీ మీడియా సైతం 'డంకీ' వైపు మొగ్గు చూపవచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ డౌట్.
Salaar cast and crew names : 'సలార్' సినిమాలో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రలో ఆమె నటించారు ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు.