Jr NTR Cameo in Tiger 3 : బాలీవుడ్ సినిమా 'టైగర్ 3' కోసం టాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూడడానికి ఓ కారణం మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. సల్మాన్ ఖాన్ సినిమా అయినప్పటికీ... తెలుగులో మాస్ ప్రేక్షకుల వరకు 'టైగర్ 3' చేరింది. ఎందుకంటే... మన ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనువిందు చేస్తారని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరగడం! దానికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.


సారీ... 'టైగర్ 3'లో ఎన్టీఆర్ లేరు!
భారతీయ గూఢచారిగా సల్మాన్ ఖాన్ (Salman Khan) మరోసారి సందడి చేసిన సినిమా 'టైగర్ 3'. అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు 'టైగర్ 3'లో ఎన్టీఆర్ లేరని కన్ఫర్మ్ చేశారు. సో... ఇది యంగ్ టైగర్ అభిమానులకు డిజప్పాయింట్ న్యూస్ అన్నమాట! ఎన్టీఆర్ (Jr NTR in Tiger 3)తో పాటు బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సైతం 'టైగర్ 3'లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఆయన అయితే ఉన్నారు కానీ... ఎండ్ క్రెడిట్ టైటిల్స్ అప్పుడు మాత్రమే ఉన్నారట. అదీ సంగతి!


'టైగర్ 3'లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఎదురు చూడడానికి కారణం 'వార్ 2' (War 2). యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)లో తాజా సినిమా 'టైగర్ 3'. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్' తర్వాత ఆ ఫ్రాంచైజీలో తెరకెక్కిన తాజా చిత్రమిది. 


Also Read : 'టైగర్ 3'కి యాంటీ ఫ్యాన్స్ షాక్ - ఇండియాలో నెగిటివ్ రివ్యూలు, బ్లాక్‌బస్టర్ టాక్‌తో మొదలైన ఓవర్సీస్ షోలు


'పఠాన్'లో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రకు మంచి స్పందన లభించింది. దాంతో 'టైగర్ 3'లో షారుఖ్ ఖాన్ చేత అతిథి పాత్ర చేయించారు. అంతే కాదు... 'వార్ 2' కంటే ముందు 'టైగర్ 3'లో ఎన్టీఆర్ కనిపిస్తారని, ఆయన పాత్రను సల్మాన్ ఖాన్ పరిచయం చేస్తారని ప్రచారం జరిగింది. అటువంటి ఏమీ లేదని ఈ రోజు క్లారిటీ వచ్చింది.
  
'వార్ 2'తోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఆయన బాలీవుడ్ ఎంట్రీ కోసం 'వార్ 2' వరకు వెయిట్ చేయాలి. దాని కంటే ముందు 'దేవర' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆయన పలకరించనున్నారు. నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ హీరోయిన్ కావడం, ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో హిందీ ప్రేక్షకులలో సైతం 'దేవర' మీద మంచి అంచనాలు ఉన్నాయి. 'దేవర', 'వార్ 2' సినిమాలతో పాటు 'కెజియఫ్', 'సలార్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 
  
Also Read మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?