స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్


స్కిల్ స్కాం కేసులో (Skill Scam Case) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు (AP High Court) వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం, ఈ నెల 15కు విచారణ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సీఐడీ ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో మరింత సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు విచారణ వాయిదా వేసింది. తొలుత విచారణను ఈ నెల 22కు వాయిదా వేయాలని హైకోర్టును ప్రత్యేక పీపీ అభ్యర్థించగా, తోసిపుచ్చిన న్యాయస్థానం 15కి వాయిదా వేసింది. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చిచెప్పింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. ఇంకా చదవండి


చివరి క్షణంలో నారాయణఖేడ్ అభ్యర్థి మార్పు - సంజీవరెడ్డికి చాన్సిచ్చిన కాంగ్రెస్!


ఉమ్మడి  మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ చివరి క్షణంలో మార్చింది.  సురేష్ షెట్కర్  ( Suresh Shetkar )  చివరి నిమిషంలో ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. పట్లోళ్ల సంజీవ రెడ్డికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. నారాయణఖేడ్‌ సీట్‌ను మూడో విడత జాబితాలో.. సురేష్‌ షెట్కార్‌కు ప్రకటించిన హైకమాండ్... తాజాగా ఆ స్థానంలో సంజీవరెడ్డిని కేటాయించింది. సురేష్ షెట్కార్‌ సంజీవరెడ్డి మధ్య కేసీ వేణుగోపాల్ ( KC Venugopal )  రాజీ కుదిర్చారు. సురేష్‌ షెట్కార్‌‌కు జహీరాబాద్ ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇవ్వడంతో సమస్య కొలిక్కి వచ్చింది. ఇంకా చదవండి


వచ్చే ఎన్నికలు మాకు లైఫ్ అండ్ డెత్ - జేసీ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు


వచ్చే ఎన్నికలు తమకు లైఫ్ అండ్ డెత్ సమస్య అని  జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎస్పీ అన్బురాజన్ ను ( Anantapuram SP )  కార్యాలయంలో కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే వచ్చానని ప్రత్యేకంగా ఎజెండా ఏమీలేదన్నారు.   రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు... తాడేపల్లి రాజ్యాంగం ( Tadepalli )  ఉందని ప్రభుత్వంపై విమర్శలు  గుప్పించారు. తన పై పెట్టిన కేసులన్నీ పూర్తి కావాలంటే మూడు జన్మలు కావాలన్నారు.  ఇప్పటికే నాకు 73 ఏళ్ల వయసు ఆ కేసులన్నీ ఎప్పటికీ క్లియర్ అవుతాయని ప్రశ్నించారు. ఇంకా చదవండి


తెలంగాణలో పోటీకి 14 మందితో ఫైనల్‌ జాబితా విడుదల చేసిన బీజేపీ 


తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్లకు తుది గడువు దగ్గర పడుతున్నప్పటికీ అభ్యర్థుల ఖరారులో జాతీయ పార్టీలు వెనకబడ్డాయి. రాత్రికి రాత్రి కాంగ్రెస్‌ ఆఖరి జాబితా రిలీజ్ చేస్తే.. శుక్రవారం ఉదయం బీజేపీ 14 మందితో తుది జాబితా రిలీజ్ చేసింది. చాంద్రాయణగుట్ట, వనపర్తి అభ్యర్థులను మార్చింది. పొత్తులో భాగంగా 8 స్థానాలను జనసేనకు కేటాయించగా, తాజా జాబితాలో 111 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది. ఇంకా చదవండి