Telangana Elections 2023 : నారాయణ ఖేడ్ :  ఉమ్మడి  మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ చివరి క్షణంలో మార్చింది.  సురేష్ షెట్కర్  ( Suresh Shetkar )  చివరి నిమిషంలో ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. పట్లోళ్ల సంజీవ రెడ్డికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. నారాయణఖేడ్‌ సీట్‌ను మూడో విడత జాబితాలో.. సురేష్‌ షెట్కార్‌కు ప్రకటించిన హైకమాండ్... తాజాగా ఆ స్థానంలో సంజీవరెడ్డిని కేటాయించింది. సురేష్ షెట్కార్‌ సంజీవరెడ్డి మధ్య కేసీ వేణుగోపాల్ ( KC Venugopal )  రాజీ కుదిర్చారు. సురేష్‌ షెట్కార్‌‌కు జహీరాబాద్ ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇవ్వడంతో సమస్య కొలిక్కి వచ్చింది.


టిక్కెట్ కోసం పోటీలో షెట్కార్ వైపు కాంగ్రెస్ మొగ్గు                                        


టికెట్‌ కోసం సంజీవరెడ్డి, సురేష్ షెట్కర్‌ తీవ్రంగా పోటీపడ్డారు. అయితే హైకమాండ్ ముందు సురేశ్ షెట్కర్‌ వైపే మొగ్గు చూపింది. టికెట్ కోసం సంజీవరెడ్డి నామినేషన్ల చివరిరోజు వరకు ప్రయత్నించారు. ఆయన ఆశలు ఫలించాయి. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ షెట్కర్‌ తప్పుకుని సంజీవరెడ్డికి మద్దతు పలికారు. దీంతో సంజీవరెడ్డి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామం హాట్ గా టాపిక్ గా మారింది.              


ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ జోరు - ఆన్ లైన్ ప్రచారం అతిగా మారుతోందా ?


ఎంపీగా బరిలో నిలిచేందుకు ఎమ్మెల్యే టిక్కెట్ వదులుకున్న సురేష్ షెట్కార్        


స్వయంగా సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకునే అంశాన్ని ప్రకటించడంతో పాటు సంజీవరెడ్డికి సంపూర్ణ సహకారం ఇస్తానని, ఆయనను గెలిపించుకుంటానని ప్రకటించారు. నామినేషన్ వేసే కార్యక్రమానికి స్వయంగా తానే వెళ్ళి మద్దతు పలుకుతానని తెలిపారు. నామినేషన్ చివరి రోజున ఊహించని తీరులో జరిగిన ఈ పరిణామాన్ని పార్టీ పెద్దలు కూడా స్వాగతించారు. కాంగ్రెస్ తరఫున ఆ స్థానంలో సంజీవరెడ్డి అధికారిక అభ్యర్థి కానున్నారు.                     


పొంగులేటి ఇళ్లలో రెండో రోజు కొనసాగుతోన్న సోదాలు - కీలక పత్రాలు స్వాధీనం


పట్టుదలతో అనుచరులకు టిక్కెట్లు ఇప్పించిన దామోదర రాజనర్సింహా      


టికెట్ రాలేదని అసంతృప్తితో మదనపడుతూ పార్టీ మారడానికి సిద్ధమవుతున్న సమయంలో సురేష్ షెట్కర్ ఈ నిర్ణయణం తీసుకోవడం పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించింది. పటాన్ చెరు, నారాయణఖేడ్ టిక్కెట్లను కాటా శ్రీనివాస్ గౌడ్,  సంజీవరెడ్డిలకు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా పట్టుబట్టారు.  అయితే వివిధ సమీకరణాలతో పటాన్ చెరు టిక్కెట్ ను నీలం మధుకు, ఖేడ్ టిక్కెట్ ను సురేష్ షెట్కార్ కు కేటాయించారు. కానీ తర్వాత ఒక రోజు తేడాతో ఇద్దర్నీ మార్చారు. దాంతో దామోదర రాజనర్సింహా తన పట్టు నిరూపించుకున్నట్లు అయింది.