ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోల్చితే సోషల్ మీడియా ప్రభావం మరింతగా పెరిగింది. న్యూస్ వెబ్ సైట్లు పుట్టగొడుగుల మాదిరి పుట్టుకొస్తున్నాయి. వ్యూస్ కోసం ఆయా వెబ్ సైట్లు దారుణమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నాయి. ఎదుటి వారి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా వార్తలు రాసేందుకు కూడా వెనుకాడటం లేదు. తప్పుడు వార్తలలో చాలా మంది తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ముఖ్యంగా సినీ స్టార్స్ పై మరింత అడ్డగోలుగా వార్తలు ప్రచురిస్తున్నారు. తాజాగా రష్మిక మందన్న, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు డీప్ ఫేక్ బారినపడ్డారు. తాజాగా నటి మమతా మోహన్ దాస్ పై కొన్ని వెబ్ సైట్లు దారుణమైన రాతలు రాశాయి. తన ఆరోగ్యం గురించి అసత్య వార్తలు పబ్లిష్ చేశాయి.


సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న మమత


మలయాళ భామ మమతా మోహన్ దాస్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది. నటిగానే కాదు, గాయనిగానూ ఆమె సత్తా చాటింది. ‘శివన్‌’ సినిమాతో కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. విశాల్‌కు జంటగా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలకు పాటలు పాడింది. ‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. జూ ఎన్టీఆర్‌ తో కలిసి ఈ సినిమాలో ఆడి పాడింది. అటు కన్నడ చిత్ర పరిశ్రమలోనూ హీరోయిన్ గా రాణించింది.


Read Also: వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణం అదే, వైవాహిక జీవితంపై హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!


మమత ఆరోగ్యంపై తప్పుడు వార్తలు


కొంత కాలం క్రితం మమతా మోహన్‌ దాస్‌  క్యాన్సర్‌ బారిన పడింది. మెరుగైన చికిత్స ద్వారా  ఆ సమస్య నుంచి బయటపడింది. ప్రస్తుతం మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. మలయాళం, తమిళం భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. రీసెంట్ గా గీతు నాయర్‌ అనే ఓ ఫేక్ అకౌంట్ నుంచి ఇన్‌ స్టాలో పోస్ట్‌ రాశారు. “ఇక నేను బతకలేను, చావుకు లొంగిపోతున్నా, నటి మమతా మోహన్‌ దుర్భర జీవితం” అనే పేరుతో ఈ వార్త పబ్లిష్ చేశారు. ఈ వార్త కాసేపట్లోనే నెట్టింట్లో బాగా సర్క్యులేట్ అయ్యింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది ఈ వార్తను చూసి షాక్ అయ్యారు.  


ఫేక్ న్యూస్ పై మమత తీవ్ర ఆగ్రహం


ఈ వార్తా కథనంపై నటి మమతా మోహన్ దాస్ స్పందించింది. ప్రచారం కోసం మరీ ఇలా చీప్ రాతలు రాయకూడదని హెచ్చరించింది. వ్యూస్ కోసం ఇతరుల జీవితాల గురించి ఫేక్ వార్తలు పబ్లిష్ చేయడం ఏంటని ప్రశ్నించింది. అసలు నా గురించి మీకు ఏం తెలుసని ఆ రాతలు రాశారంటూ నిలదీసింది. మీ పేజీని పాపులర్ చేసుకోవడానికి ఎవరి గురించి ఏమైనా రాస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ అకౌంట్స్ ను ఎంకరేజ్ చేయకూడదని నెటిజన్లకు మమతా విజ్ఞప్తి చేసింది.