Guppedantha Manasu November 10th Episode (గుప్పెడంతమనసు నవంబరు 10 ఎపిసోడ్)


వసుధార రిషి ఇద్దరు కారులో వెళుతూ ఏంజెల్ మాటలు గుర్తుచేసుకుని బాధపడతారు. 
నిజం దాచి పెట్టినందుకు ఏంజెల్ చాలా ఫీల్ అయింది కానీ విశ్వనాథం గారు  అర్థం చేసుకుని మాట్లాడారు. ఏంజెల్ కూడా పోను పోను అర్థం చేసుకుంటుంది అనడంతో వసుధార మౌనంగా ఉంటుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు ఎందుకు మౌనంగా ఉన్నావో నాకు తెలుసు వసుధార జగతి మేడం చనిపోయిన విషయం వాళ్లకు ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తున్నావు కదా అనడంతో అవును సార్ అని అంటుంది. మనం ఏం చెప్పినా కూడా ఏంజెల్ నమ్మే పరిస్థితిలో లేదు అలాంటప్పుడు చెప్పినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదంటాడు. అయినా అమ్మ లేదు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. మా అమ్మ చనిపోయిన విషయం నేను ఎవరికీ చెప్పను నా ప్రాణం ఉన్నంతవరకు మా అమ్మ నా గుండెల్లోనే ఉంటుంది అంటాడు..ఇంతలో రిషి సడెన్ గా కారు బ్రేక్ వేస్తాడు. 


Also Read: జగతి లెటర్ రిషిని చేరుతుందా , సీక్రెట్స్ మెంటైన్ చేస్తున్న అనుపమ-ఏంజెల్


రిషి చేతికి లెటర్స్
అప్పుడు ఎదురుగా పాండియన్ వచ్చి నిలబడడంతో పాండియన్ నువ్వా ఏంటి ఎదురుగా నిలబడ్డావు అనడంతో ఇవి ఇవ్వడానికి వచ్చాను సార్ అని లెటర్స్ ఇస్తాడు. దీనికోసం మళ్ళీ నువ్వు రావడం ఎందుకు ఫోన్ చేస్తే నేనే వచ్చే వాడిని కదా అనడంతో పర్లేదు శ్రమ ఏమీ లేదు అని అంటాడు. తర్వాత జాగ్రత్తలు చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు రిషి. తర్వాత వసుధార వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. 


లవ్ స్టోరీ చెప్పిన మహేంద్ర
మరోవైపు మహేంద్ర నిద్రపోతుండగా ఇంతలో వసుధార వాళ్ళు అక్కడికి వస్తారు. ఏంటి నాన్న నేను మందు తాగానని భయపడుతున్నావా నేను నీకు మాట ఇచ్చాను కదా అందుకే తాగను అనడంతో రిషి సంతోష పడతాడు. పెదనాన్న వాళ్లు వచ్చారు భోజనం చేసి వెళ్లారు అనడంతో సరే మావయ్య నేను వెళ్లి భోజనం తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది వసు. తర్వాత రిషికి మహేంద్ర..జగతితో పరిచయం , ప్రేమ , జగతి పడిన బాధను చూసి తల్లడిల్లిన సందర్భాల నుంచి మొదలుపెట్టి...ఆ తర్వాత వసుధార గురించి చెబుతాడు.. 
మహేంద్ర ఇవన్నీ రిషికి చెబుతున్నప్పుడు అక్కడికి వచ్చిన వసుధార వింటుంది...ఏమోషన్ అవుతుంది...
మహేంద్ర: వసుధార కూడా చాలా గొప్పది తన బావను పెళ్లి చేసుకోకుండా ఉండడం కోసం ప్రపంచంలో ఏ ఆడపిల్ల చేయని త్యాగం చేసింది అనడంతో వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వే తాళి కట్టినట్టుగా మెడలో వేసుకున్న మహానుభావురాలు అని వసుధారని  పొగుడుతూ ఉంటాడు మహేంద్ర.  
రిషి: అవును డాడీ నేను కూడా అప్పుడు భ్రమపడి తనను చాలా బాధ పెట్టాను
మహేంద్ర: నాకు జగతి దొరకడం ఎంత అదృష్టమో నీకు వసుధార దొరకడం అంతకంటే ఎక్కువ అదృష్టం . నాకైతే ఒక నమ్మకం ఉంది రిషి వసుధారకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తను నీ చేయి వదలదు నువ్వు కూడా అలాగే తన చెయ్యి ఎప్పటికీ వదలకు అనడంతో ఆ మాటలకు వసుధార ఎమోషనల్ అవుతుంది. 
రిషి: సారీ డాడ్ నేను కూడా వసుధారని చాలా బాధపెట్టాను
మహేంద్ర: మనసు స్థిమితంగా ఉండలేదు..అప్పుడప్పుడు నిజాన్ని గుర్తించలేదు..తన విషయంలో పొరపాటు పడకు..
రిషి: తనని గుర్తించేలోగా నేను చాలా కోల్పోయాను..ఇకపై అలా జరగదు..
మహేంద్ర: వసుధారని చాలా బాగా చూసుకో..మీ ఇద్దరూ చాలా సంతోషంగా ఉండాలి
వసుధార వచ్చి భోజనం ప్లేట్ ఇస్తుంది... కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది...మహేంద్ర మాటలు గుర్తుచేసుకుంటుంది...
వెనుకే వెళ్లిన రిషి..సర్ ప్రైజ్ అంటూ కళ్లు మూస్తాడు... 


Also Read: నిలదీసిన ఏంజెల్ - నిజం చెప్పిన రిషి, దేవయానికి ఇచ్చిపడేసిన ఫణీంద్ర!


రిషి - వసుధార
రిషి: ఏంటిది..కన్నీళ్లెందుకు
వసు: ఏం లేదు సార్
రిషి: ఏదో ఉంది..లేదంటే ఎందుకుకన్నీళ్లు వస్తున్నాయి
వసు: నాకేమైనా బాధ ఉంటే మీకు చెబుతాను కదా..
కళ్లు మూసుకో సర్ ప్రైజ్ అని చెప్పి చెవి కమ్మలు తీసి ఇస్తాడు... అవి చూసి వసు చాలా సంతోషపడుతుంది. నచ్చిందా లేదా అని అడిగితే చాలా బావుంది అంటుంది..నువ్వు కావాలనే అలా చెబుతున్నావ్ - నాకు సెలక్షన్ రాదంటాడు...అలా అయితే నన్ను అవమానించినట్టే నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారని బుంగమూతి పెడుతుంది. కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు..ఆ కమ్మలు తీసి పెట్టుకోబోతుండగా నేను పెడతానంటాడు రిషి. ఓ చెవికి రింగ్ పెట్టి మరో చెవికి పెడుతుండగా కిందపడుతుంది..దాన్ని తీసి దాచేసిన రిషి..వసుని ఆటపట్టిస్తాడు... ఎంతో ప్రేమగా నీకోసం తీసుకొచ్చాను ఇలా అయిందేటని ఆటపట్టిస్తాడు... కచ్చితంగా దొరుకుతుంది సార్ అంటుంది వసుధార...


Also Read: రిషిధారని చూసి షాక్ లో విశ్వనాథం-ఏంజెల్, అనుపమ వచ్చేసింది!