Guppedantha Manasu November 09th Episode (గుప్పెడంతమనసు నవంబరు 09 ఎపిసోడ్)

ఏం జరిగిందో మొత్తం రిషి చెప్పిన తర్వాత కూడా ఏంజెల్ నమ్మదు. అప్పుడు వసుధార నమ్మితీరాలంటుంది. తను చెప్పలేదు సరే మరి నువ్వెందుకు చెప్పలేదని వసుధారని నిలదీస్తుంది ఏంజెల్. కిరీటం పోగొట్టుకున్న మహారాజు నా కిరీటం పోయిందని చెప్పగలడా అంటుంది. మాది పెళ్లితోనే ప్రేమతోనో ఏర్పడిన బంధం కాదంటూ తను డీబీఎస్టీ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి జరిగినదంతా చెబుతుంది. మీరు ఎన్నైనా చెప్పండి నేను నమ్మను అంటుంది ఏంజెల్...పైన రూమ్ లో ఫ్రెష్ అయి వచ్చిన అనుపమ..ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుందని అనుకుంటుంది...ఇంతలో పెద్దమ్మ కాల్ చేసి అక్కడ అందర్నీ కలిశావా అని అడుగుతుంది..ఇంకా లేదని చెప్పి కాల్ కట్ చేస్తుందిఏంజెల్: ఇదంతా కరెక్ట్ కాదువిశ్వం: వాళ్లు జీవితంలో విడిపోయి ఒకరికి తెలియకుండా మరొకరు వచ్చారు..వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి..నువ్వు వాళ్లని ఏమీ అనొద్దని చెప్పి ఆశీర్వదిస్తాడు..డీబీఎస్టీ కాలేజీ మాత్రమే కాదు ..విష్ కాలేజీ కూడా నీదే..అది మర్చిపోకూడదురిషి: విష్ కాలేజీకి రిషిధారల అవసరం ఏ సమయంలో ఉన్నా మేం వస్తాం సార్ అని చెప్పి బయలుదేరుతాం అని చెబుతారు..అప్పుడు విశ్వం...పసుపు, కుంకుమ ఇచ్చి కొత్త పెళ్లికూతుర్ని పంపించమ్మా అని చెబుతాడు... ఏంజెల్ మాత్రం అదే బాధలో ఉంటుందిమాపై ఇంకా కోపంగానే ఉందా అని రిషి అడిగితే..ఇది కోపం కాదు బాధ అంటుంది..ఏంజెల్: నిన్ను చాలా నమ్మాను..అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను..రిషి విషయం కూడా నీకు చెప్పాను..రిషి నువ్వు నమ్మకద్రోహం చేశావా, వెన్నుపోటు పొడిచావా అని నేను అనను..మీరిద్దరూ నా దగ్గర చాలా పెద్ద విషయాలు దాచారు, నాకు తెలియకుండానే నేను మిమ్మల్ని నమ్మాను.. నాకు డౌట్ వస్తే మీరిద్దరూ కప్పిపుచ్చారు..ఓ విషయం చెప్పనా..మీరిద్దరూ కలసి నన్ను తెలివితక్కువ దద్దమ్మని చేశారు..రిషి: అవన్నీ దాచినందుకు మేం ఎంత స్ట్రగుల్ అయ్యామో అర్థం చేసుకో..ఏంజెల్: మేం అందులోంచి బయటకు రావడానికి టైమ్ పడుతుంది...వెళ్లొస్తాం సార్ అనేసి రిషి వసుధారలు బయలుదేరుతారు... అప్పుడై పైన డోర్ సౌండ్ వినిపిస్తుంది....సుభద్రమ్మా...పైన ఎవరున్నారు సౌండ్ వస్తోందని అడుగుతాడు...పైన ఓ అమ్మగారు వచ్చారు..లాక్ వేసి ఉన్న గది తాళాలు అడిగారని చెబుతుంది... అప్పుడు అనుపమ పైనుంచి కిందకు వస్తుంది..చూసి షాక్ అవుతాడు విశ్వనాథం...అనుపమా అని...విశ్వనాథం: ఇన్నాళ్లకు నాపై నీకు కోపం తగ్గిందా..నన్ను చూసేందుకు ఇన్నేళ్లకు వచ్చావాఏంజెల్: విశ్వం ఎవరు తనువిశ్వం: తను మీ అత్తయ్య అని ఏంజెల్ కి.... మీ అన్నయ్య కూతురమ్మా అని అనుపమకి చెబుతాడు..ఎలా ఉన్నారు డాడ్ అని అడిగిన అనుపమతో మనకు తెలిసినవాళ్లొచ్చారు వెళ్లిపోయారని చెబుతారు.

Also Read: నిలదీసిన ఏంజెల్ - నిజం చెప్పిన రిషి, దేవయానికి ఇచ్చిపడేసిన ఫణీంద్ర!

జగతి ఫొటో ముందు నిల్చుని బాధపడతాడు మహేంద్ర.. మందువైపు మనసు వెళ్లినా.. రిషికి ఇచ్చిన మాట గుర్తొచ్చి మళ్లీ ఆలోచనను వెనక్కు తీసుకుంటాడు. ఓ డైరీ తీసుకుని చూస్తూ..ఇందులో మన తీపి జ్ఞాపకాలున్నాయి నువ్వే లేవు..మన ఫ్రెండ్ అనుపమ కాల్ చేసింది కానీ నేను మాట్లాడలేదు..నాకు భయం వేసింది..అందుకే ఫోన్ స్విచ్చాఫ్ చేశాను...తను ఎదురుపడితే నీ గురించే అడుగుతోంది..నువ్వులేవన్న నిజం తనకి చెప్పలేక నేను తనతో మాట్లాడకుండా తప్పించుకుంటున్నాను..ఎందుకు జగతి నాకు ఇలాంటి కష్టాన్ని తెచ్చి పెట్టావ్ అని బాధపడతాడు..

Also Read: రిషిధారని చూసి షాక్ లో విశ్వనాథం-ఏంజెల్, అనుపమ వచ్చేసింది!

అనుపమ రూమ్ లో బట్టలు సర్దుకుంటు ఉంటుంది...కింద ఓ ఫొటో పడుతుంది.. అత్తయ్యా ఇది నీ ఫొటోనా అని ఏంజెల్ అడిగితే..తను చూడకుండానే లాక్కుంటుంది అనుపమ...పర్సనల్ అంటుంది. ఏంజెల్: నీలాగానే నాకో ఫ్రెండ్ ఉండేవాడు..ఏది అడిగినా పర్సనల్ అనేవాడు..చివరికి పెద్ద షాకిచ్చాడుఅనుపమ: ఎవరుఏంజెల్: ఇది నా పర్సనల్.. అయినా నువ్వు అప్పుడు అందర్నీ లా దూరం పెట్టేదానివో ఇప్పుడు కూడా అలానే ఉన్నావ్...అనుపమ: నీకెలా తెలుసుఏంజెల్: విశ్వం చెప్పాడులే

మరోవైపు విష్ కాలేజీ ప్రిన్సిపాల్ రిషికి జగతి నుంచి వచ్చిన లెటర్స్ చూసి అయ్యో ఇవ్వడం మర్చిపోయాను అనుకుంటూ పాండ్యన్ ని పిలిచి రిషి సార్ కి అందించమని ఇస్తాడు. మరోవైపు విశ్వనాథం ఇంటి నుంచి తిరిగి వెళుతూ..ఏంజెల్ మాటలు గుర్తుచేసుకుంటారు రిషి, వసుధార.  విశ్వనాథం సార్ మన పరిస్థితిని అర్థం చేసుకున్నారు...ఏంజెల్ కూడా నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది అంటాడు.. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు...ఎపిసోడ్ ముగిసింది