Bigg Boss Season 7 Latest Promo : బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా నవంబర్ 9న ప్రసారమయ్యే ఎపిసోడ్ కూడా చాలా ఎమోషనల్ గా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన ప్రోమోస్ చూస్తే అర్థమవుతుంది. గురువారం విడుదలైన ప్రోమోస్ లో అమర్ దీప్ భార్య తేజస్విని తోపాటు శోభ మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా శోభ మదర్ హౌస్ లోకి రావడం, యావర్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ తేవడం, నేను కూడా మీ అమ్మనే అని చెప్పడం ఆడియన్స్ ని ఎంతో ఎమోషనల్ చేసింది. తాజాగా ఆ ఎమోషన్ ని కంటిన్యూ చేస్తూ బిగ్ బాస్ నుంచి మరో ప్రోమో విడుదలైంది.


ఈ ప్రోమోలో ఎప్పుడెప్పుడు తన ఫ్యామిలీ మెంబర్ వస్తారా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యావర్ బ్రదర్ హౌస్​లోకి వచ్చారు. దీంతో యావర్ ఫుల్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రోమో అంత చాలా ఎమోషనల్​గా సాగింది. ఒకసారి ప్రోమోని పరిశీలిస్తే.. హౌస్ మేట్స్ అంతా యాక్టివిటీ ఏరియాలో ఉండగా బిగ్ బాస్ గేట్ తెరవడం, మూయడం చేశారు. అది చూసిన గౌతమ్ 'టైం పాస్ చేస్తున్నారా మాతోని?' అని బిగ్ బాస్​తో అంటాడు. ఆ తర్వాత మళ్లీ గేట్ ఓపెన్ అవ్వగా, యావర్ గేటు దగ్గర వెళ్లి తొంగి చూస్తాడు. దాంతో గేట్ క్లోజ్ అవుతుంది. అప్పుడు అశ్విని దాన్ని చూసి 'దాగుడుమూతలు ఎందుకు?' అని చెబుతుంది.


ఆ సమయంలో యావర్ వాళ్ల బ్రదర్ వాయిస్ వినిపిస్తుంది "యావు మేర బచ్చా" అని వాయిస్ వినిపించడంతో యావర్, భయ్యా అని ఆనందంతో తన బ్రదర్ కోసం ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో కనిపించకపోవడంతో మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి గేటు దగ్గర చూస్తాడు. అక్కడ కూడా లేకపోవడంతో ఆక్టివిటీ రూమ్ నుంచి వచ్చిన తన అన్నయ్యని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేశాడు. ఆ తర్వాత యావర్ బ్రదర్ హౌస్ మేట్స్ తో "మీ అందరికీ నమస్కారం" అని అంటాడు. అనంతరం గౌతమ్ కు థాంక్స్ చెబుతాడు." యావర్ వాళ్ళ అమ్మను చాలా మిస్ అవుతున్నాడు.


ఎందుకంటే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అతనికి తెలియదు?" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పగా యావర్ తన బ్రదర్ ని హగ్ చేసుకుని గుక్కపెట్టి మరీ ఏడుస్తాడు. దాంతో యావర్ ని ఓదారుస్తూ.." అమ్మ ప్రేమ మాకు తెలీదు" అంటూ ఎమోషనల్ అవ్వగా శివాజీ యవార్ బ్రదర్​ని ఓదారుస్తాడు. అనంతరం.." We Are Fighters, Fight For it. just Do Fight. I Want That Cup. Everybody Wants a Cup" అని తమ్ముడికి చెబుతూ మోటివేట్ చేశాడు. ఆ తర్వాత "బిగ్ బాస్ ఇంటిని మీరు వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది" అని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. దాంతో ఈ యావర్ బ్రదర్ వెళ్తూ వెళ్తూ తన తమ్ముడిని హగ్ చేసుకోవడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. ఎంతో ఎమోషనల్ గా సాగిన ఈ ఎపిసోడ్ ని చూడాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే. లేదా హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే లైవ్ స్ట్రీమింగ్ లో చూడొచ్చు.


Also Read : 'అన్ స్టాపబుల్' సర్​ప్రైజ్​​ ఎపిసోడ్ - సీజన్ 3లో రణ్ బీర్, రష్మిక సందడి, ఎప్పుడంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial