Bigg Boss Season 7 Latest Promo : బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఆడియన్స్ ని ఎంతగానో ఎమోషనల్ చేస్తున్నారు. ఇప్పటికే హౌస్ లో శివాజీ కొడుకు, అర్జున్ వైఫ్, అశ్విని మదర్, గౌతమ్ మదర్, ప్రియాంక కాబోయే భర్త, బోలె భార్య సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ 9వ తేదీ ఎపిసోడ్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన ప్రోమోలో అమరదీప్ భార్య తేజస్విని గౌడ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా అమరదీప్ బర్త్ డే కావడంతో కేక్ పంపించి ఆ తర్వాత భర్తను సర్ప్రైజ్ చేసింది. భార్య రావడంతో అమర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు.


అంతేకాకుండా కంటెస్టెంట్స్ అందరూ అమర్ దీప్ ను కింద కూర్చోబెట్టి మరి తేజస్వినితో రింగు తొడిగించారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో శోభా శెట్టి మదర్ హౌస్ లోకి వచ్చారు. ఈ ప్రోమో ఫుల్ ఎమోషన్ మోడ్ లోకి వెళ్ళింది. ఒకసారి ప్రోమోని పరిశీలిస్తే.. తన మదర్ హౌస్ లోకి రావడం చూసిన శోభా శెట్టి మమ్మీ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా వాటేసుకుని ఏడుస్తుండగా, ఏడవకూడదు అంటూ వాళ్ళ అమ్మ చెప్పింది. ఆ తర్వాత ఒక్కో హౌస్ మెట్ ని కౌలించుకున్న శోభా మదర్ శివాజీ ని చూడగానే దగ్గరికి వెళ్లి గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది.


అనంతరం యవార్ ని దగ్గరికి తీసుకొని "ఎందుకు ఏడ్చావు నువ్వు.. మీ అమ్మ లేదనా, నేను అమ్మని కాదా?" అని చెబుతూ యావర్ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చింది. ఆ గిఫ్ట్ ని తన చీర కొంగులో నుంచి తీసి యావర్ ఇవ్వగానే యావర్ ఆ గిఫ్ట్ చూసి గట్టిగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే, యవార్ వాళ్ళ అమ్మ గారి ఫోటో ఫ్రేమ్. యావర్ అమ్మగారి ఫోటో ఫ్రేమ్ ని శోభ శెట్టి వాళ్ళ అమ్మ తెస్తుందని ఎవరు ఊహించలేదు. దీంతో యావర్ తో పాటూ హౌస్ మేట్స్ అందరూ చాలా సంతోషించారు. తన అమ్మగారిని తనివితీరా  చూసుకున్న యావర్ సంతోషంతో శోభా శెట్టి వాళ్ళ అమ్మ కాళ్లకు మొక్కాడు.


దీంతో ఆమె యవార్ ని దగ్గరికి తీసుకుని, "నువ్వు నా కొడుకువి రా.. ఏడవకూడదు?" అంటూ చెప్పడంతో హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత శోభా శెట్టితో వాళ్ళ అమ్మ.." నీ కోపం నాకు తెలుసు, నీకు తెలుసు.. వీళ్ళందరికీ ఏం తెలుసు? అంటూ తెలుగులో స్పష్టంగా చెబుతుంది. ఆ తర్వాత యావర్ తన అమ్మ గారి ఫోటో ఫ్రేమ్ ని చూస్తూ ఏడుస్తుండగా, "ఏడిస్తే అమ్మ ఊరుకోదు" అంటూ గౌతమ్ ఓదార్చాడు. ఆ తర్వాత యావర్ బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పాడు." మీకు తెలుగు రాదని చెప్పింది, మీరు బానే తెలుగు మాట్లాడుతున్నారు" అని అశ్విని శోభ మదర్ తో చెప్పగానే," రోజు తెలుగు చూస్తాను కదా" అని శోభ మదర్ ఉంటుంది.


ఆ తర్వాత శోభ గౌతమ్ ని చూపిస్తూ.." అమ్మ మా ఇద్దరి గొడవ చూసావా?" అని కన్నడలో అడుగుతుంది. దాంతో శోభ మదర్ చూసానని కన్నడలోనే చెబుతుంది. ఇక చివరగా వెళ్తూ వెళ్తూ ఈ అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ కి కోటి కోటి వందనాలు అని చెబుతూ.." నువ్వు బాగా ఆడాలి, కప్పు తీసుకొని రావాలి" అంటూ కూతురికి చెప్పి కౌగిలించుకొని నుదుటిపై ముద్దు పెడుతుంది. దాంతో శోభ తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటుంది. అనంతరం బయటికి వెళ్తుండగా.. "ఆగు మమ్మీ గేట్ తీయలేదు ఇంకా" అంటూ మరోసారి తన తల్లిని శోభ కౌగిలించుకోవడంతో ప్రోమో ఎండ్ అవుతుంది.


Also Read : ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial