Gruhalakshmi November 10th : రూంలో కింద పడిపోయిన దివ్యను తన చేతులతో ఎత్తుకుని వెళ్తున్న విక్రమ్ తో పడేస్తావ్ అంటూ దివ్య భయపడుతుంది. ఎప్పుడో నిన్ను ప్రేమలో పడేశాను. ఇప్పుడు కొత్తగా ఏం పడేసేది ఉండుదలే అంటూ అక్కడి నుంచి దివ్యను ఎత్తుకుని తన రూంలోకి వెళ్తాడు విక్రమ్.
బసవయ్య: జాను నువ్వు వాళ్లను దూరం చేయాలనుకుంటున్నావా? దగ్గర చేయాలనుకుంటున్నావా? ఇలా అయితే ఇంకో నెల రోజులు ఇక్కడే ఉంటారు వాళ్లు.
అనగానే జాను కోపంతో కూడిన బాధతో చూస్తుండిపోతుంది.
ఆఫీసులో బిజిగా ఉంటారు నందగోపాల్, తులసి. ఇంతలో తులసి క్యాబిన్‌లోకి మేనేజర్ వస్తారు.
మేనేజర్: వచ్చిన దగ్గర నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా వర్క్ లో మునిగిపోయారు మేడం మీరు.
తులసి: నేను ఈ సీట్లో కూర్చుంది రెస్ట్ తీసుకోవడానికో.. రిలాక్స్ అవ్వడానికో కాదు. కంపెనీ విషయంలో సామ్రాట్ గారి లక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా చేరుకోవడానికి
మేనేజర్: మీ గురించి తెలుసు మేడం.
తులసి: ధనంజయ్ గారు వచ్చిన్నప్పటి నుంచి కంపెనీలో వారు తీసుకున్న నిర్ణయాలు అన్నింటినీ రివ్యూ చేయాలనుకుంటున్నాను.
మేనేజర్: నందగోపాల్ గారు ఆల్‌రెడీ ఆదే పనిలో ఉన్నారు మేడం. ఆయన ఒక్కొక్కరిని పిలిచి అన్నీ వెరిఫై చేస్తున్నారు. వెరీ టాలెంటెడ్ ఆయన.
అంటూ ఫైలు తులసికి ఇస్తాడు మేనేజర్. ఫైలు చెక్ చేసిన తులసి వెరీ గుడ్ అంటూ పంపిచేస్తుంది. ఇంటి దగ్గర నందగోపాల్, తులసి కోసం వాళ్ల అమ్మానాన్నలు ఎదురుచూస్తుంటారు. ఇంతలో తులసి వాళ్లు రాగానే దిష్టి తీస్తామని వాళ్లిద్దరికి కలిపి దిష్టి తీస్తారు. లోపలికి వెళ్లిన తర్వాత కొత్త ఆఫీసు ఎలా ఉందని అడుగుతారు తులసి వాళ్ల అత్తయ్య.
తులసి: తెలిసిన ఆఫీసు, తెలిసిన స్టాఫే కదత్తయ్య టెన్షన్ ఏం లేదు. పైగా మీ అబ్బాయి కూడా నాకు సపోర్టుగా ఉన్నారుగా..ఏ సమస్య వచ్చినా నా దాకా రాకుండా ఆయనే సాల్వ్ చేస్తున్నారు. పేరుకు మాత్రమే నేను సీఈవోని
అనగానే పోనిలేమ్మా వాడు నీకు ఈ విధంగానైనా ఉపయోగపడుతున్నాడు అని నందను కూడా తులసి పొగుడుతుంది కదా అని పొంగిపోకు అంటూ హితబోధ చేస్తారు
Also Read: సీరియస్ సింహం కాదు రొమాంటిక్ రిషి - మహేంద్ర మాటలు బాగానే పనిచేశాయ్!
స్ప్రే తీసుకుని రూంలోకి వచ్చిన విక్రమ్.. దివ్య మంచం దిగబోతుంటే ఆపి
విక్రమ్: మంచం దిగకూడదమ్మా..!
దివ్య: ఎందుకమ్మా
విక్రమ్: నీ కాలు బెనికిందమ్మా నొప్పెడుతుందమ్మా
దివ్య: లేదు మొర్రో అంటే వినిపించుకోవేంటి?
విక్రమ్: స్ప్రే కొడతానంటే నువ్వు వినవేంటి
దివ్య: నీ వేషాలు నాకు తెలుసు
విక్రమ్: వేషాలేంటి? ఇందాక నీ కాలు బెనికినప్పుడు నా గుండె ఎంత విలవిలలాడిందో తెలుసా?
దివ్య: తెలుసు శ్రీవారు నన్ను ఎత్తుకున్నారుగా నీ గుండెల మీద చెవి పెట్టి విన్నాను.
అంటూ దివ్య, విక్రమ్ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు.
Also Read: వీలునామాలో తాతయ్య ఏం రాశారు- రుద్రాణికి ఆస్థి భాగం ఇవ్వొద్దన్న అపర్ణ!
నందగోపాల్, తులసి హాల్లో కూర్చుని ఆఫీసు విషయాలు డిస్కష్ చేస్తుంటారు. దూరం నుంచి వారిని గమనించిన నంద వాళ్ల అమ్మా, నాన్న వారిని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మాట్లాడుకుంటారు. తొందరలో వాళ్లిద్దరూ ఒకట్టై జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటారు.
నందు: సరిగ్గా నేను అదే అనుకుంటున్నాను నా మనసులో మాట నీకు తెలిసిపోయింది. ఎంతైనా బాస్ వి కదా
తులసి: మీరలా అంటుంటే వెటకారం చేస్తున్నట్లుగా ఉంది.
నందు: అలా ఏం లేదు తులసి
అనగానే తులసి, దివ్యకు ఫోన్ చేసి దీపావళి పండగకు ఇద్దరూ కలిసి ఇంటికి రమ్మని పిలుస్తుంది. హనిమూన్‌లో ఉన్నామని రాలేమని దివ్య చెప్తుంది. పిల్లలెవరూ లేకుండా పండగ చేసుకోవడం అంటే ఇల్లంతా బోసిగా ఉంటుందని తులసి బాధపడుతుంది. ఎవరి జీవితాలు వారివి అయ్యాక మనం హోప్స్ పెట్టుకోకూడదని నందు చెప్తాడు. మరోవైపు విక్రమ్, దివ్యలను భయపెట్టి ఇంటికి పారిపోయేలా చేయడానికి బసవయ్య కిరాయి రౌడీలను పురమాయిస్తాడు.
ఇంట్లో నందగోపాల్ వాళ్ల నాన్న కలసి క్యారమ్స్ అడుతుంటారు.
నంద డాడీ: గొప్పోడివేరా ఒప్పుకుంటాను. కాకపోతే ఒక్కటే కంప్లైంట్.. ఏమీ లేదురా నువ్వు ఆటలో చూపించే నేర్పు ఓర్పు తులసి విషయంలో చూపించవేంటి? నీ మనసులో మాట తులసికి చెప్తానని నా చిన్నప్పటి నుంచి చెప్తున్నావు కానీ ఇప్పటి వరకు చెప్పింది లేదు.
నంద: మరీ అలా తీసిపారేయకండి నాన్న ఎన్నిసార్లు ట్రై చేయలేదు.
పరీక్ష ఎన్నిసార్లు రాశామన్నది కాదు ముఖ్యం పాస్ అయ్యామా లేదా అన్నదే ముఖ్యం అంటూ వాళ్ల నాన్న అనడంతో దీపావళి పండగ టార్గెట్‌గా పెట్టుకున్నాను. ఖచ్చితంగా రేపు టైం చూసుకుని చెప్తానంటాడు నందు. ఇంతలో తులసి టీ తీసుకుని వస్తుంది. పండగకు పిల్లలు రాకపోతే ఏంటి మీ పుట్టింటి వాళ్లను పండక్కి పిలవమని నందు చెప్పడంతో తులసి సంతోషపడుతుంది..ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది...