టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ కొనసాగిస్తున్నాడు. రీసెంట్ గా బోయపాటి శ్రీనుతో కలిసి చేసిన ‘స్కంద’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్నాడు రామ్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్ గా వస్తోంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ కు సీక్వెల్ గా వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.


Read Also: వ్యూస్ కోసం దేనికైనా దిగజారుతారా -ఫేక్ న్యూస్ పై మమతా మోహన్‌దాస్‌ తీవ్ర ఆగ్రహం


పూరీతో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ చేస్తున్న రామ్


ఓవైపు పూరీతో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ కంప్లీట్ కాకుండానే మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు  రామ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో  ఈ సినిమా రూపొందబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అయితే, ఈ మూవీకి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు? అనే విషయాన్ని మాత్రం ఇంకా బయటకు వెల్లడించలేదు.


Also Read: ఇలాంటివి చూస్తే భయమేస్తోంది, హీరోయిన్ కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్


రామ్ తాజా చిత్రంలో కన్నడ బ్యూటీ!


తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ‘సప్తసాగరాలు దాటి’ అనే కన్నడ మూవీలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది రుక్మిణి వసంత్‌. ఈమెతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రామ్ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట.  దాదాపు ఈ చర్చలు సక్సెస్ అయినట్లు టాక్ నడుస్తోంది. సౌత్ సినిమా పరిశ్రమలో టాలీవుడ్ కు మంచి క్రేజ్ ఉంది. తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజిలో దుమ్మురేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రుక్మిణి వసంత్ ఈ సినిమాలో నటించేందుకు వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ సినిమాతో తన కెరీర్ కు మరింత బూస్టింగ్ వస్తుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించే అవకాశం ఉంది.


ఈ నెల 17న ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ బి’ విడుదల


రక్షిత్‌శెట్టి హీరోగా రుక్మిణీ వసంత్‌, చైత్ర జె ఆచార్‌ హీరోయిన్లుగా  ‘సప్తసాగరాలు దాటి’ సినిమా తెరకెక్కింది. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందింది.  ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ ఏ’  సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ బి’ ఈ నెల 17న విడుదల కానుంది. పీపుల్స్ మీడియా బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.  


Also Read:  వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణం అదే, వైవాహిక జీవితంపై హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!