Keerthy Suresh Comments On Rashmika Deep Fake Video Controversy: గత కొద్ది రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డీప్ ఫేక్ (Fake Video) వ్యవహారం దుమారం రేపుతోంది. సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna)కు సంబంధించిన ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా, మరుసటి రోజే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్(Katrina Kife Deep Fake Photo) ఫేక్ ఫోటోలు సైతం హల్ చల్ చేశాయి. సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని జోడించి ఫేక్ వీడియోను రూపొందించారు కొందరు కేటుగాళ్లు. అటు ‘టైగర్ 3’(Tiger 3 )లోని కత్రినా టవర్ ఫైట్ ఫోటోను తీసుకుని ఆమె లోదుస్తుల్లో ఉన్నట్లు క్రియేట్ చేశారు. ఈ ఫోటోలు, వీడియోలపై పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పాటు నాగ చైతన్య, మంచు విష్ణు, విజయ్‌ దేవరకొండ లాంటి నటులు రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫోటోలను రూపొందించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


డీప్ ఫేక్ వీడియో చూస్తుంటే భయమేస్తోంది- కీర్తి


తాజాగా డీప్ ఫేక్ వ్యవహారంపై హీరోయిన్‌ కీర్తి సురేష్ సైతం రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా రష్మిక ఫేక్ వీడియోపై స్పందించింది. ఇలాంటి పనికిరాని వీడియోలు తయారు చేసే బదులు, అందరికీ ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుందని హితవు పలికింది. “ నెట్టింట్లో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోను చూస్తుంటే చాలా ఆందోళన కలుగుతుంది. ఇలాంటి చెత్త వీడియోలు తయారు చేసే వ్యక్తి, ఆ టెక్నాలజీని, విలువైన సమయాన్ని మంచి పనికి ఉపయోగిస్తే బాగుంటుంది. ప్రస్తుతం డెవలప్ అవుతున్న టెక్నాలజీ వరమో? శాపమో? అర్థం కావట్లేదు. ప్రేమను, మంచిని పంచడం కోసం ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటే బాగుటుంది. అంతేకానీ, ఇలాంటి చెత్త పనుల కోసం వాడటం మానేయడం మంచింది” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. 


డీప్ ఫేక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను 36 గంటల్లోగా అన్ని సైట్ల నుంచి తొలగించాలని సంబంధిత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లకు ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ సైబర్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 


వరుస సినిమాలతో కీర్తి ఫుల్ బిజీ


కీర్తి సినిమాల విషయానికి వస్తే ఇటీవల ‘భోళా శంకర్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా 'భోళా శంకర్‌' తెరకెక్కింది.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'వేదాళం' సినిమాకి రీమేక్‌ గా 'భోళా శంకర్‌' తెరకెక్కింది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేశ్‌, సుశాంత్‌ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం కీర్తి ‘సైరెన్’, ‘రఘు తాత’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివెడి’ అనే తమిళ సినిమాల్లో నటిస్తోంది.


Read Also: రష్మిక వేసుకునే డ్రెస్సులు, ఎక్స్‌పోజింగ్ కంటే పెద్దగా ఏమీ లేదు - ‘డీప్‌ఫేక్’పై మాధవీ లత కామెంట్స్