Maadhavi Latha: హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జారా పటేల్ అనే బ్రిటిష్ ఇండియన్ అమ్మాయి శరీరానికి రష్మిక ఫేస్ కనిపించేలా AI టెక్నాలజీతో మార్ఫింగ్ చేసిన ఈ వీడియోపై అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే నటి మాధవీ లత మాత్రం ఈ అంశం మీద కాస్త భిన్నంగా స్పందించింది. రష్మిక సినిమాల్లో ఈవెంట్స్ లో ధరించే డ్రెస్సుల కంటే అది అంత అసహ్యంగా, వల్గర్ గా ఏమీ లేదని కామెంట్ చేయటం నెట్టింట వైరల్ గా మారింది.


మాధవి లత ఇన్స్టాగ్రామ్ వేదికగా రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై స్పందింది. "రష్మీక ఫోటోని వేరే అమ్మాయి బాడీకి అటాచ్ చేయడం జరిగింది. కాకపోతే అందులో పెద్ద అసహ్యంగా వల్గర్ గా ఏమీ లేదు. రష్మిక సినిమాల్లో ఈవెంట్స్ లో వేసుకునే డ్రెస్సుల కంటే, తను చూపించే బూ** షో కంటే ఆ వీడియోలో పెద్దగా ఏమీ లేదు. బాడీ మాత్రమే డిఫరెన్స్. కాకపోతే స్టార్ హీరోయిన్స్ ఎప్పుడైతే ఒక ఇష్యూని లేవనెత్తుతారో అప్పుడు ఆ విషయం సొసైటీలో పెద్ద టాపిక్ గా మారిపోతుంది" అని మాధవి తెలిపింది.


"తాజాగా జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా రష్మీకతో తాము ఉన్నామని ప్రకటించినట్లు న్యూస్ చూశాను. అది చూసి నాకు నవ్వొచ్చింది. మై డియర్ జర్నలిస్ట్స్.. మీరు రష్మిక మందన్నతో ఉండటం కాదు.. బయట ఉన్న ఆడవాళ్ళ సేఫ్టీకి మీరు సహకారం అందిస్తే చాలా బాగుంటుంది. సొసైటీలో ఉన్న అమ్మాయిలకు అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ అందిస్తే మీ జర్నలిజానికి ఒక విలువ ఉంటుంది. మొత్తం బట్టలన్నీ విప్పేసి హీరోయిన్ గా నటించేసి, ఏదో అప్పటి సావిత్రి లాగా ఇప్పుడు సాయి పల్లవి మాధవీలత మాదిరిగా మడిగట్టుకొని కూర్చొనే హీరోయిన్లేం కాదు వాళ్ళు. కాకపోతే ఒక సమస్యను లేవనెత్తడం అనేది మంచి విషయం. నేనూ దాని గురించే మాట్లాడాను"


"విషయం గురించి మాట్లాడటం గుడ్ థింగే కానీ, అక్కడ ఒక స్కాండల్ లో ఇరికించి రష్మిక మీద చాలా అసహ్యమైన వీడియోలేం చెయ్యలేదు. సో రష్మిక ఒరిజినల్ గా వేసుకునే డ్రెస్సుల కంటే ఆ అమ్మాయి పెద్దగా అభ్యంతరమైన డ్రెస్ వేసుకోలేదు. పైగా అది స్విమ్ షూట్. స్విమ్ షూట్స్ అలానే ఉంటాయి. కాకపోతే సైజ్ మ్యాటర్స్. అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. జర్నలిస్స్ అందరూ ఫలానా హీరోయిన్ కు సపోర్ట్ అని కాకుండా, బయట ఉన్న సమాజానికి సపోర్ట్.. అందుకే మీరు చదువుకుంది అని చెప్తే చాలా చాలా బాగుంటుంది." అని మాధవీ లత చెప్పుకొచ్చింది.






రష్మిక మార్ఫింగ్ వీడియోపై అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆమెకు సపోర్ట్ గా నిలిస్తుంటే.. నటి మాధవి లత ఇలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అది కూడా రష్మిక గ్లామరస్ ఫోటోలు షేర్ చేసి మరీ, ఈ అంశంపై మాట్లాడటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇక్కడ మాధవి పోస్ట్ పై ట్రోల్ చేసే వారి కంటే, ఆమెకు మద్దతుగా కామెంట్లు పెట్టే నెటిజన్ల ఉండటం గమనార్హం.


ఇదిలా ఉంటే రష్మీక మందన్న మార్ఫింగ్ వీడియోపై అనేకమంది సినీ సెలబ్రిటీలు స్పందించారు. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు, మృణాల్ ఠాకూర్ వంటి వారు తమ ఆందోళనను లేవనెత్తారు. ఇలాంటి ఫేక్ వీడియోలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటివి అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుందనే అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. 


రష్మిక మందాన్న మార్ఫింగ్ వీడియోపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడిన ఫేక్ కంటెంట్‌ను 24 గంటల్లో తొలగించాలని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ అడ్వైజరీ పంపింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అనుసరించాల్సిన చట్టపరమైన నిబంధనలను పునరుద్ఘాటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 ప్రకారం, సాంకేతికను ఉపయోగించి మోసాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 1 లక్ష వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.


Also Read: 'ఎవరికీ ఇలా జరగకూడదు'.. రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన విజయ్‌!