TDP Leader JC Prabhakar Reddy Seirous Comments On Elections :  తాడిపత్రి  వచ్చే ఎన్నికలు తమకు లైఫ్ అండ్ డెత్ సమస్య అని  జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎస్పీ అన్బురాజన్ ను ( Anantapuram SP )  కార్యాలయంలో కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే వచ్చానని ప్రత్యేకంగా ఎజెండా ఏమీలేదన్నారు.   రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు... తాడేపల్లి రాజ్యాంగం ( Tadepalli )  ఉందని ప్రభుత్వంపై విమర్శలు  గుప్పించారు. తన పై పెట్టిన కేసులన్నీ పూర్తి కావాలంటే మూడు జన్మలు కావాలన్నారు.  ఇప్పటికే నాకు 73 ఏళ్ల వయసు ఆ కేసులన్నీ ఎప్పటికీ క్లియర్ అవుతాయని ప్రశ్నించారు.                                                           

  


 పుట్లూరు, యల్లనూరు మండలాల్లో భారీగా దొంగ ఓట్లు ( AP Fake Votes ) చేర్చారని.. ఆ రెండు మండలాలు తహసిల్దార్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.  మాకు ఈ ఎన్నికలు చాలా లైఫ్ అండ్ డెత్ లాంటివి..  అందుకే చాలా సీరియస్ గా తీసుకున్నామన్నారు.  ఎక్కడ ఏ తప్పిదం జరిగినా ఊరుకోబోమని..  ఎన్ని కేసులు వచ్చినా వెనక్కు తగ్గేది లేదన్నారు.  రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏమాత్రం తమ పరిధిలో పనిచేయడం లేదని విమర్శలు గుప్పించారు.


Also: సీఎం జగన్ కు గంటా బహిరంగ లేఖ - 20 ప్రశ్నలు సంధించిన టీడీపీ ఎమ్మెల్యే    


జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో వారసుడికి అవకాశం ఇచ్చారు. అయితే  ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే అయినా  కేతిరెడ్డి పెద్దారెడ్డితో ఆయనకు తీవ్రమైన విబేధాలున్నాయి. ఈ కారణంగా తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పెద్దారెడ్డి ఓ సారి జేసీ ఇంట్లోకి కూడా చొరబడి.. నడి ఇంట్లో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. అప్పుడు జేసీ ఇంట్లో ఎవరూ లేరు. హుటాహుటిన తన ఇంటికి వచ్చిన జేసీ... పెద్దారెడ్డి కూర్చున్న కుర్చీని రోడ్డుపై తగులబెట్టారు. అప్పట్నుంచి రెండు వర్గాల మధ్య వివాదాలు మరంత పెరిగాయి.                             


Also:  స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ - హైకోర్టు కీలక నిర్ణయం
 
మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండటంతో అభివృ్ధి పనుల విషయంలోనూ తరచూ ఏదో వివాదం  చోటు చేసుకుంటూనే ఉంది. ఇలా గొడవలు అయినప్పుడల్లా..  జేసీపై కేసులు పెడుతూనే ఉన్నారు. మూడు రోజుల కిందట..  డ్రైనేజీ పనులు చేయడం లేదని.. జేసీ నిరసన వ్యక్తం చేయడంతో కేసులు పెట్టారు.