ODI World Cup 2023 Latest News: భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ మరో తొమ్మిది రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే సెమీఫైనల్‌ చేరే జట్లేవో దాదాపుగా తేలిపోయింది. తొలి సెమీస్‌లో టీమిండియాతో న్యూజిలాండ్‌ తలపడడం ఖాయంగానే ఉంది. మరో సెమీస్‌లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. శ్రీలంకపై న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించడంతో ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ బెర్తులు దాదాపు ఖాయమయ్యాయి. ఇప్పటివరకూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో భారత్ కొనసాగుతుండగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయాలు సాధించి అజేయంగా నిలిచింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో టాప్‌ స్కోరర్‌లు ఎవరంటే..
 ప్రపంచకప్ 2023 అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రచిన్‌ రవీంద్ర కొనసాగుతున్నాడు. తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా స్టార్‌ బ్యాట్సమెన్‌ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో ఉండగా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు.
 
ఐసీసీ ప్రపంచకప్‌ 2023లో టాప్‌ స్కోరర్లు
1. రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) - 9 మ్యాచ్‌ల్లో 70.62 సగటుతో 565 పరుగులు
2. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) - 8 మ్యాచ్‌ల్లో 68.75 సగటుతో 550 పరుగులు
3. విరాట్ కోహ్లీ (భారత్) - 8 మ్యాచ్‌ల్లో 108.60 సగటుతో 543 పరుగులు 
4. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - 8 మ్యాచ్‌ల్లో 55.75 సగటుతో 446 పరుగులు 
5. రోహిత్ శర్మ (భారత్‌) - 8 ఇన్నింగ్స్‌లలో 55.25 సగటుతో 442 పరుగులు
గురువారం న్యూజిలాండ్ శ్రీలంక  మ్యాచ్ తరువాత, శ్రీలంకకు చెందిన దిల్షాన్ మధుశంక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.


ఐసీసీ ప్రపంచకప్‌ 2023లో టాప్‌ వికెట్‌ టేకర్లు
1. దిల్షాన్ మధుశంక (శ్రీలంక) - 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు 
2. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) - 8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు 
3. మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా) - 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు 
4. మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్) - 9 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు 
5. మహ్మద్ షమీ (భారత్) -4 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు 


ఈ ప్రపంచకప్‌లో భారత్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో షమీకి అవకాశం దక్కలేదు. ఆ తర్వాత చోటు దక్కించుకున్న షమీ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరుఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన షమీ.. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి 55 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికాను కూడా 100 పరుగుల లోపే ఆలౌట్‌ చేసింది.


Also Read: చరిత్రను మార్చాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికా, ఈసారి తగ్గేదే లే అంటున్న సఫారీలు


Also Read: టీమిండియాతో అంత ఈజీ కాదు, కివీస్‌ స్టార్‌ బౌలర్‌ వ్యాఖ్యలు


Also Read: పాక్‌ సెమీస్‌కు దూరమైనట్లే , అంత తేడాతో గెలవడం సాధ్యమేనా?


Also Read: ఈ ప్రపంచకప్‌లో సిక్సర్లే సిక్సర్లు, చరిత్రలోనే తొలిసారట