Most Sixes Recorded In World Cup 2023: భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో ఇప్పటికే మూడు జట్లు సెమీస్‌ చేరిపోయాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, అఫ్గాన్‌ మధ్య పోరు నడుస్తోంది. ఈ మహా సంగ్రామంలో బ్యాటర్లు విధ్వంస సృష్టిస్తుండగా..బౌలర్లు ప్రతాపం చూపుతున్నారు. అయితే దక్షిణాఫ్రికాతో మొదలైన పరుగుల వరద కొనసాగుతూనే ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఈ తరుణంలో భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 49 ఏళ్ళ  వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఈ ప్రపంచకప్‌లో నమోదైనన్నీ సిక్సర్లు మరే వరల్డ్‌కప్‌లోనూ నమోదు కాలేదు. ఈ ప్రపంచకప్‌లో తొలిసారిగా ఓ ఎడిషన్‌లో ఐదు వందల సిక్సర్లు నమోదయ్యాయి. బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుండడంతో ఈ రికార్డు సాధ్యమైంది, రోహిత్‌ శర్మ సిక్సర్లతో ఆరంభం నుంచే విరుచుకుపడుతుండగా.. మ్యాక్స్‌వెల్‌, డికాక్‌, ఫకర్‌ జమాన్‌, వార్నర్‌ కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు. అందుకే ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే 500 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన 40 మ్యాచ్‌లలోనే  500 సిక్సర్లు నమోదయ్యాయి. ఇంగ్లండ్‌ – నెదర్లాండ్స్‌ మధ్య పూణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో మలన్‌ రెండు సిక్సర్లు బాదడంతో ఈ ఎడిషన్‌లో 500 సిక్సర్లు పూర్తయ్యాయి. 

 

వరల్డ్‌కప్‌లో నమోదైన సిక్సర్లు

2023 ప్రపంచకప్‌లో ఇప్పటికే 500 సిక్సర్లు

2019 ప్రపంచకప్‌లో  47 మ్యాచుల్లో 353 సిక్సులు

2015 వరల్డ్‌ కప్‌లో 48 మ్యాచ్‌లలో 463 సిక్సర్లు

2011లో 49 మ్యాచ్‌లలో 258 సిక్సర్లు

2007 ప్రపంచకప్‌లో 51 మ్యాచుల్లో 373 సిక్సర్లు

2003 ప్రపంచకప్‌లో 52 మ్యాచుల్లో 266 సిక్సర్లు

1999 ప్రపంచకప్‌లో 42 మ్యాచుల్లో 153 సిక్సర్లు

1996 ప్రపంచకప్‌లో 36 మ్యాచుల్లో 148 సిక్సర్లు

1992 ప్రపంచకప్‌లో 39 మ్యాచుల్లో 93 సిక్సర్లు

1987 ప్రపంచకప్‌లో 27 మ్యాచుల్లో 126 సిక్సర్లు

1983 ప్రపంచకప్‌లో 27 మ్యాచుల్లో 77 సిక్సర్లు

1979 ప్రపంచకప్‌లో 14 మ్యాచుల్లో 28 సిక్సర్లు

1975 ప్రపంచకప్‌లో 15 మ్యాచుల్లో 28 సిక్సర్లు

 

2023 వరల్డ్‌ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రోహిత్‌ శర్మ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లు తలా 22 సిక్సర్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. డేవిడ్‌ వార్నర్‌ (20), క్వింటన్‌ డికాక్‌ (18), ఫకర్‌ జమాన్‌ (18)లు టాప్‌-5లో ఉన్నారు.

 

అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో 553 సిక్సర్లతో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా సారధి రోహిత్‌ శర్మ బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సర్లు బాదగా... హిట్ మ్యాన్ మాత్రం కేవలం 473 ఇన్నింగ్స్‌ల్లోనే 554 సిక్సులు బాది ఆ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌కు.. రోహిత్‌ శర్మ మధ్య 78 ఇన్నింగ్స్‌ల తేడా ఉండడం విశేషం.

 

అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ప్రస్తుతం రోహిత్ దరిదాపుల్లో కూడా ఎవరూ కనపపడం లేదు. అత్యధిక సిక్సుల విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్‌ గప్తిల్‌ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్‌ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్ ఒక్కడే 315 సిక్స్‌లతో టాప్‌ 10లో చివరి ప్లేస్‌లో ఉన్నాడు. ఈ టాప్‌ టెన్‌లో మిగిలిన బట్లర్‌, రోహిత్‌ తప్ప మిగిలిన ఆటగాళ్లందరూ రిటైర్‌ అయిపోయారు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (283) 11 వ స్థానంలో కొనసాగుతున్నాడు.