వైసీపీ నేతల వంద రోజుల బస్ యాత్ర - భారీ ప్రచార కార్యక్రమం రెడీ!


వైసీపీ నేతలందరూ వంద రోజుల పాటు ప్రజల్లో ఉండేలా ప్రత్యేక కార్యక్రమన్ని ఆ పార్టీ హైకమాండ్ రెడీ చేసింది.  ప్రస్తుతం  పార్టీ పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టికేంద్రీకరించారు. - జిల్లా పార్టీ అధ్యక్షులు, నూతన కార్యవర్గాలను ఎంపికచేశారు. ఈనెలాఖరులోగా మండల కమిటీలను నియమించడం పూర్తి చేయనున్నారు.  ఈ కమిటీలు పూర్తి కాగానే ప్రతి జిల్లాలోనూ ఆయా జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో జిల్లా కార్యవర్గ సభ్యులతో బస్‌ యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. ఇంకా చదవండి


బాలుడిని డాబా పైనుంచి తోసేసిన వాలంటీర్, ఏం జరిగిందంటే?


తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఓ గ్రామ వాలంటీర్ దాష్టీకానికి ఓ బాలుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలయ్యాడు. సిగరెట్లు తీసుకురమ్మంటే తీసుకు రాలేదని బాలుడిని  డాబాపై నుంచి తోసేశాడో గ్రామ వాలంటీర్. దీంతో బాలుడి ఒక కాలు, చేయి విరిగి తీవ్ర గాయాలతో మంచాన పడ్డాడు. పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకా చదవండి


కాంగ్రెస్‌లో ఊహించని చేరికలు ఉండబోతున్నాయా?


తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఇంకా నెలకుపైగా సమయం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు.  కానీ కాంగ్రెస్ లో మాత్రం ఇప్పుడే అసలు జోష్ కనిపిస్తోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ  చేయాలన్న  పట్టుదలతో కీలక నేతలందర్ని పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే కొద్ది రోజుల్లో ఆ పార్టీలో ఊహించని  చేరికలు ఉంటాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇంకా చదవండి


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇక ఇంటికే: మల్లికార్జున ఖర్గే


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. బీజేపీతో పాటు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్ ను గద్దె దింపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించిన బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని అమ్మేస్తోందని మండిపడ్డారు. మతతత్వ బీజేపీని గద్దె దించడానికి రాజకీయ శక్తులన్ని ఏకమయ్యాయని అన్నారు. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి... నెరవేరుస్తున్నామని ప్రకటించారు. ఇంకా చదవండి


అల్లు అర్జున్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు


యేటా ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో భాగంగా 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో టాలీవుడ్ సినిమాలు పలు అవార్డులు సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకోవడంపై ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు వారి సత్తా చాటి అవార్డులు కైవసం చేసుకున్న అందరినీ అభినందించారు. ఈసారి ఉత్తరాదితో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమకే అత్యధిక అవార్డులు వచ్చాయి. ఇంకా చదవండి


3పిల్లలకు విక్రమ్, ప్రజ్ఞాన్ గా నామకరణం - చంద్రయాన్ 3 సక్సెస్ ఎఫెక్ట్


చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం, ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఘనతను, ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభను మెచ్చుకున్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. దాంతో ఇటీవల జంట తమ బిడ్డకు చంద్రయాన్ గా నామకరణం చేయడం తెలిసిందే. తాజాగా కర్ణాటకకు చెందిన వారు తమ కుమారులకు విక్రమ్, ప్రజ్ఞాన్ లుగా నామకరణం చేసి దేశ భక్తిని చాటుకున్నారు. స్థానికులు సైతం వీరి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, చిన్నారుల పేర్లపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చదవండి


'అఖండ 2'పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి - బాలకృష్ణ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే స్పీచ్!


గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) హ్యాట్రిక్ హిట్స్ తీశారు. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఈ తరం దర్శకులలో బాలయ్యను బోయపాటి చూపించినట్టు... మరో దర్శకుడు చూపించలేదంటే అతిశయోక్తి కాదు. అందుకని, వీళ్ళ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు బోయపాటి శ్రీను కిక్‌ ఇచ్చే మాట చెప్పారు. ఇంకా చదవండి


సమంతను తిడుతూ విజయ్ దేవరకొండ పాట


ఆలుమగలు అన్నాక అలకలు సహజం. భార్యా భర్తల మధ్య గొడవలు, గిల్లికజ్జాలు కామన్. ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెళ్ళాంతో వేగలేక పోతున్న ఓ భర్త పబ్బులో పాట పాడితే? 'ఖుషి' సినిమాలో (Kushi Movie) ఐదో పాట 'ఓసి పెళ్ళామా...'లా ఉంటుందని చెప్పవచ్చు ఏమో!? ఇంకా చదవండి


ఈ 28న రిలయన్స్ ఏజీఎం, 5జీ ఫోన్లు, 5జీ ప్లాన్లు మరెన్నో!


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ వార్షిక సాధారణ సమావేశానికి (రిలయన్స్ ఏజీఎం) సిద్ధమవుతోంది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఏటా ఏజీఎం సమావేశం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 28న ఈ సమావేశం జరుగనుంది. 2016లో జియో టెలికాం నెట్‌వర్క్‌ లాంచింగ్‌ అనంతరం రిలయన్స్‌ ఏజీఎంలపై దేశం మొత్తం ఆసక్తి ఏర్పడింది. ఇందులో ప్రకటించే అంశాలు సాధారణ ప్రజలను సైతం ఆకర్శిస్తాయి. ఇంకా చదవండి


వన్డే వరల్డ్ కప్‌కు దాదా జట్టు ఇదే - తెలుగోడికి దక్కని ఛాన్స్


అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌కు సమయం ముంచుకొస్తున్న వేళ  టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే  జట్టు కూర్పుతో పాటు 15 మంది సభ్యులలో  ఎవరిని జట్టులో ఉంచాలి..? ఎవరిని తీసేయాలి..? అన్నదానిపై ఇంకా  క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో   టీమిండియా మాజీ  సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. 15 మంది సభ్యులతో కూడిన జట్టును  ప్రకటించాడు.  రోహిత్ శర్మ నేతృత్వంలోని ఈ జట్టులో ఐదుగురు బ్యాటర్లు ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు,  ఒక స్పిన్నర్, నలుగురు పేసర్లకు ఛాన్స్ ఇచ్చాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చి  విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న  తిలక్ వర్మకు దాదా జట్టులో చోటు దక్కలేదు. ఇంకా చదవండి