ఆలుమగలు అన్నాక అలకలు సహజం. భార్యా భర్తల మధ్య గొడవలు, గిల్లికజ్జాలు కామన్. ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెళ్ళాంతో వేగలేక పోతున్న ఓ భర్త పబ్బులో పాట పాడితే? 'ఖుషి' సినిమాలో (Kushi Movie) ఐదో పాట 'ఓసి పెళ్ళామా...'లా ఉంటుందని చెప్పవచ్చు ఏమో!?
'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు (Samantha) జంటగా నటించిన చిత్రం 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఐదో పాట 'ఓసి పెళ్ళామా...'ను విడుదల చేశారు.
''కశ్మీర్ లో ఫస్ట్ టైమ్ తనని జూసినా
ముందెనక చూడకుండా మానసిచ్చినా
బాబు మాట పక్కనెట్టి బయటకొచ్చినా
లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ జేసినా...
ఓఓ స్ట్రగుల్ స్టార్ట్ ఆయానే!
ఓఓ పాప ఛేంజ్ అయ్యనే!
ఓసి పెళ్ళామా...
నన్ను మిర్చిలాగ నంజుకుంటావే
వద్దు ఆపమ్మా...
నేను కోడిలాగ గింజుకుంటానే''
అంటూ సాగిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ ఆలపించారు. శివ నిర్వాణ లిరిక్స్ రాయగా... హేషమ్ అబ్దుల్ వాహేబ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో అన్ని పాటలను శివ నిర్వాణ రాసిన సంగతి తెలిసిందే. అన్ని పాటలకూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
Also Read : కార్తికేయకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ - నేహా శెట్టి ఎందుకు రాలేదంటే?
'ఖుషి' సెన్సార్ పూర్తి - సర్టిఫికెట్ ఏంటి?
'ఖుషి' సినిమాకు సెన్సార్ బోర్డు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే... పెద్దలతో పాటు పిల్లలు కూడా సినిమా చూడొచ్చు అన్నమాట. ఇంకా ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే... 165 నిమిషాలు! అంటే... రెండు గంటల 45 నిమిషాలు అన్నమాట. మూడు గంటలకు ఒక్క పావుగంట తక్కువ.
Also Read : హారర్ థ్రిల్లర్ సినిమాతో రాజమౌళి హీరోయిన్ రీ ఎంట్రీ - లుక్ చూశారా?
'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'లో విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ట్రైలర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా కథ ఏమిటనేది అందులో క్లారిటీ ఇచ్చేశారు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, ఆలీ, శరణ్య పొన్నవణ్నన్, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మేకప్ : బాషా, కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్ - హర్మన్ కౌర్ - పల్లవి సింగ్, కళా దర్శకత్వం : ఉత్తర కుమార్ - చంద్రిక, పోరాటాలు : పీటర్ హెయిన్, రచనా సహకారం : నరేష్ బాబు .పి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : దినేష్ నరసింహన్, కూర్పు : ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్, సంగీతం : హేషమ్ అబ్దుల్ వాహబ్, సి.ఇ.ఓ : చెర్రీ, ఛాయాగ్రహణం : జి. మురళి, నిర్మాతలు : నవీన్ యేర్నేని - రవిశంకర్ యలమంచిలి, కథ, కథనం, కొరియోగ్రఫీ, దర్శకత్వం : శివ నిర్వాణ.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial