'7/G బృందావన కాలనీ' సీక్వెల్‌లో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ!
కోలీవుడ్ అగ్ర దర్శకుడు సెల్వరాఘవన్ (Selvaraghavan) తెరకెక్కించిన '7/G బృందావన కాలనీ' అప్పట్లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే సరికొత్త ట్రెండ్ ని సృష్టించిన సినిమా ఇది. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. 2004లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. సుమారు 20 సంవత్సరాల తర్వాత దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రానికి సీక్వెల్ (7/g Brundavan Colony Sequel)ని తెరకెక్కిస్తుండగా, మరోసారి రవికృష్ణ ఈ సీక్వెల్లో లీడ్ రోల్ చేస్తున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బాయ్స్ హాస్టల్ రివ్యూ: హాస్టల్ కుర్రాళ్లు నవ్వించారా? కొత్త ప్రయత్నం ఎలా ఉంది?
2023లో కన్నడలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘హాస్టల్ హుడుగరు బేకిద్దారే’ ఒకటి. కేవలం బాక్సాఫీస్ సక్సెస్ మాత్రమే కాకుండా కంటెంట్ పరంగా కూడా అందరూ మాట్లాడుకునేలా చేసింది ఈ సినిమా. దీంతో అన్నపూర్ణ స్టూడియోస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌తో కలిసి ఈ సినిమాను ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ‘ఛాయ్ బిస్కెట్’. ట్రైలర్ కూడా ఆడియన్స్‌లో సినిమాపై ఇంట్రస్ట్‌ను పెంచింది. మరి ఈ బాయ్స్ హాస్టల్ ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రచ్చ గెలిచాం, ఇంట గెలవలేమా? నంది అవార్డులు అటకెక్కినట్లేనా?
తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. మన చిత్రాలు భాషా ప్రాంతీయత సరిహద్దులను చెరిపేసి, పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్నాయి. గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని సైతం ఆకర్షించి, హలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ క్రమంలో మన యాక్టర్స్, టెక్నిషియన్స్ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకొని భారతీయ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారు. నేషనల్ అవార్డ్స్ సాధించి టాలీవుడ్ ను అగ్రస్థానంలో నిలుపుతున్నారు. అయితే రచ్చ గెలిచిన మన సినిమాలు, ఇంట మాత్రం గెలవలేకపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాదు.. కాదు.. అస్సలు ప్రోత్సాహమే లేదంటున్నారు. ఇంత ఘనత సాధిస్తున్నా.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు మన తెలుగు సినిమాను ఇంకా చిన్న చూపే చూస్తున్నాయని సినీ ప్రేమికులు వాపోతున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో కూడా ఇదే భావన ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


థియేటర్లలో విడుదలైన వారానికి ఓటీటీలో 'పిజ్జా 3' -  ఎందులో చూడొచ్చంటే?
థియేటర్స్ లో విడుదలై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసింది ఓ హారర్ మూవీ. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు 'పిజ్జా 3'. మోహన్ గోవింద్ దర్శకత్వంలో అశ్విన్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 18న థియేటర్స్ లో విడుదలైంది. తమిళంలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 'పిజ్జా' అనే సినిమాకి ఇది పార్ట్ 3. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'బిగ్ బాస్ సీజన్ 7' కంటెస్టెంట్స్ వీళ్లేనా? లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే ఏడవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఏడవ సీజన్ కు సంబంధించి విడుదలైన ప్రోమోలు షోపై మరింత ఆసక్తి కలిగించాయి. ఈసారి 'బిగ్ బాస్ సీజన్ 7' లో సరికొత్త రూల్స్ , టాస్క్ లతో మరింత ఆసక్తికరంగా ఎవరూ ఊహించిన విధంగా ఉంటుందని నాగార్జున ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఈ షో కోసం బుల్లితెర ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా ఈసారి సీజన్లో ఎవరెవరు పాటిస్పేట్ చేస్తున్నారనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)