గన్నవరంలో వైఎస్‌ఆర్‌సీపీ అలర్ట్


గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీనేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడంతో అందరి దృష్టి మరో అసమ్మతి నేత అయిన దుట్టా రామచంద్రరావుపై పడింది. ఆయన వల్లభనేని వంశీ నాయకత్వాన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీ పోటీ చేస్తే సహకరించే ప్రశ్నే లేదంటున్నారు. దీంతో ఆయన పార్టీ వీడకుండా హైకమాండ్ జాగ్రత్తలు తీసుకంటోంది. పరిస్థితుల్ని చక్కదిద్దే బాధ్యతను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి ఇప్పగించారు. ఆయన వల్లభనేని వంశీతో కలిసి దుట్టా రామచంద్రరావుతో భేటీ కానున్నారు. ఇరువురి మధ్య విబేధాలను పరిష్కరించి.. పార్టీకి ఇబ్బంది లేకుండా చేయాలని ఎంపీ చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మళ్లీ తెలంగాణ బీజేపీలో వలసల పుకార్లు


తెలంగాణ బీజేపీ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డిని చీఫ్ గా నియమించి కొంత మంది నేతలకు పదవులు ప్రకటించిన తర్వాత .. ఇక వలసలు ఉండవని అనుకున్నారు. కానీ అభ్యర్థులు ఫైనల్ చేసే పరిస్థితికి వచ్చే సరికి పెద్ద పెద్ద నేతలు జంప్ అవబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇందులో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి వంటి నేతలు ఉన్నారు. నిజంగానే వీరంతా అదే ఆలోచనలో ఉంటే.. మరికొంత మంది సీనియర్లు కూడా తమ దారి తాము  చూసుకుంటారన్న చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మరోసారి వివాదంలోకి టీటీడీ


టీటీడీ విషయంలో ఏపీ ప్రభుత్వం వరుసగా వివాదాలకు కేంద్రంగా మారుతోంది. 2021లో 25 మందితో కూడిన నూతన జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. 80 మందితో టీటీడీ పాలకమండలి సిద్ధమైంది ఏర్పాటుతో పెద్ద వివవాదమే రేగింది. ఈఓగా పనిచేస్తున్న ధర్మారెడ్డిని ఐదేళ్ల పాటు వివిధ పదవుల్లో అక్కడే కొనసాగించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నన్ను వదిలేయండి మహాప్రభో


తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై ప్రముఖ టాలీవుడ్ సింగర్,  ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాట పాడిన  రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. మరో మూడు నెలలలో జరగాల్సి ఉన్న  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీ తరఫున  సిప్లిగంజ్ పోటీ చేయనున్నాడని.. గోషామహల్ నియోజకవర్గం నుంచి   పోటీ చేస్తాడని వస్తున్న వార్తలపై అతడు క్లారిటీ ఇచ్చాడు.  తన రాజకీయ అరంగేంట్రంపై వస్తున్నవన్నీ వదంతులేనని,  అవన్నీ ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చాడు.  ‘నేను ఎన్నికలలో పోటీ చేయట్లేదు. అవన్నీ  ఫేక్ న్యూస్’ అని ట్విటర్ వేదికగా  రాసుకొచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


“బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారెంటీ” టీడీపీ మరో సరికొత్త నినాదం-


బాబు ష్యూరిటీ- భవిష్యత్‌ కు గ్యారెంటీ పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి 45 రోజులపాటు చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి