Gannavaram Politics :   గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీనేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడంతో అందరి దృష్టి మరో అసమ్మతి నేత అయిన దుట్టా రామచంద్రరావుపై పడింది. ఆయన వల్లభనేని వంశీ నాయకత్వాన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీ పోటీ చేస్తే సహకరించే ప్రశ్నే లేదంటున్నారు. దీంతో ఆయన పార్టీ వీడకుండా హైకమాండ్ జాగ్రత్తలు తీసుకంటోంది. పరిస్థితుల్ని చక్కదిద్దే బాధ్యతను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి ఇప్పగించారు. ఆయన వల్లభనేని వంశీతో కలిసి దుట్టా రామచంద్రరావుతో భేటీ కానున్నారు. ఇరువురి మధ్య విబేధాలను పరిష్కరించి.. పార్టీకి ఇబ్బంది లేకుండా చేయాలని ఎంపీ చూస్తున్నారు. 


వైసీపీ ఏర్పాటు తర్వాత గన్నవరంలో ఆ పార్టీ కోసం పని చేసింది  దుట్టా రామచంద్రరావు.  యార్లగడ్డ 2019 ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేశారు.  . అంతకుముందు వరకూ గన్నవరం నియోజకవర్గానికి అన్నీ తానై చూసుకున్నారు. 2014లో పోటీ చేసి వల్లభనేని  వంశీ చేతిలో పరాజయం పాలయ్యారు.  గత ఎన్నికల్లో యార్లగడ్డ గెలుపు కోసం ప్రయత్నించారు.  అయితే విజయం లభించలేదు . గెలిచిన వంశీ వైసీపీలో చేరిపోయారు.  టీడీపీలో ఉన్నప్పుడు తమను కేసులతో ఇబ్బంది పెట్టారని క్యాడర్ ను రాచిరంపాలన పెట్టారని అందుకే వంశీ రాకను యార్లగడ్డ, దుట్టా ఇద్దరూ వ్యతిరేకించారు.  హైకమాండ్ అప్పట్లో నచ్చజెప్పి వెల్‌కమ్ చెప్పింది వైసీపీ. దీంతో వంశీ ఒక్కరే ఒకవైపు ఉండగా.. మరోవైపు దుట్టా, యార్లగడ్డ ఒక్కటయ్యారు. వంశీ రాకతో మొదలైన వివాదం యార్లగడ్డ రాజీనామా చేసేవరకూ వెళ్లింది. 


వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ దుట్టాకు ఎలాంటి పదవి ఇవ్వలేదు.  ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇంతవరకూ ఆ ఊసేలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. యార్లగడ్డ టీడీపీలో చేరకుండా ఉండేందుకు.. వంశీకి ఈసారి వైసీపీ టికెట్ ఇచ్చి.. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ.. యార్లగడ్డ అసెంబ్లీ టిక్కెట్ కావాలన్నారు.  యార్లగడ్డకు హామీ ఇచ్చారు కానీ.. మొదట్నుంచీ పార్టీకోసం పనిచేసిన దుట్టాకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి పదవి ఇవ్వకపోవడం.. కనీసం ఆయనకు అపాయిట్మెంట్  ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి.  దుట్టా రామచంద్రరావు  అల్లుడు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. హైదరాబాద్ లో వైద్యుడు అయిన శివభరత్ రెడ్డి.. పూర్తిగా రాజకీయాల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. సీఎం జగన్ సతీమణి భారతి రెడ్డి తరపు బంధువులు కూడా అని ప్రచారం జరుగుతూండటంతో టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు  చేస్తున్నారు.                             


అయితే పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హ మీ మేరకు వంశీకే టిక్కెట్ ఇవ్వలని జగన్ అనుకుంటున్నారు. కానీ నేతలు అందరూ దూరం అయితే మొత్తానికే మోసం వస్తుందని.. ఉన్న వారిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుట్టాను వైసీపీలోనే ఉంచేందుకు ఎంపీ బాలశౌరితో చర్చలు జరుపుతున్నారు.