దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రముఖ హాస్య నటుడు సునీల్ కథానాయకుడిగా నటించిన సినిమా 'మర్యాద రామన్న'. అందులో కథానాయికగా నటించిన అందాల భామ గుర్తు ఉన్నారా? అదేనండీ... సలోని అశ్విని (Saloni Aswani)! ఇప్పుడు ఆమె రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు.


అనన్యా నాగళ్ళ 'తంత్ర'లో సలోని!
'మల్లేశం', 'వకీల్ సాబ్' చిత్రాల ఫేమ్ అనన్యా నాగళ్ళ (Ananya Nagalla) ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'తంత్ర' (Tantra Movie). దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు శ్రీనివాస్‌ గోపిశెట్టికి కూడా ఇది తొలి సినిమా. 


'తంత్ర' సినిమాతో సలోని తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలపై నరేష్ బాబు పి, రవి చైతన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక హారర్‌ థ్రిల్లర్‌. అనన్యా నాగళ్ల ఈ జానర్ సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి. 


''పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతో పాటు గ్లామర్‌ రోల్స్ చేసి మెప్పించిన సలోని 'తంత్ర'లో డిఫరెంట్‌ గెటప్‌లో కనిపిస్తారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఆమె కనిపిస్తారు. ఇటీవల అనన్య, సలోనితో పాటు హీరోపై కీలక సన్నివేశాలను తీశాం. సినిమా అవుట్‌ పుట్‌ బాగా వచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకు రావడంతో పాటు సలోనికి మంచి కమ్‌బ్యాక్‌ అవుతుంది'' అని దర్శక, నిర్మాతలు చెప్పారు.  'మర్యాద రామన్న' కంటే ముందు సలోని కొన్ని సినిమాలు చేశారు. 'ధన 51'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యారు. 'బాడీ గార్డ్‌', 'రేసు గుర్రం' చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు. పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు. 


Also Read 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ రివ్యూ : పోలీస్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా హిట్టా? ఫట్టా?



పురాణ గాథల నేపథ్యంలో 'తంత్ర'
'తంత్ర' ఫస్ట్ లుక్ వైవిధ్యంగా ఉంది. అందులో అనన్యా నాగళ్ల కన్ను ఒక్కటే కనబడుతోంది. కొన్ని చేతులు ఆమె ముఖాన్ని పట్టుకున్నట్లు ఉంది. మన 'తంత్ర' శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. మహిళా ప్రాధాన్య చిత్రమిది. ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్‌ ఎంటర్‌టైనర్‌. పురాణ  గాథలు, భారతీయ తాంత్రిక శాస్త్రం నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది.


Also Read : 'గాండీవధారి అర్జున' రివ్యూ : వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమా ఎలా ఉందంటే?


'తంత్ర' సినిమాలో అనన్యా నాగళ్ల, ధనుష్‌, సలోని, 'టెంపర్‌' వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : ఎస్‌.బి. ఉద్దవ్‌ (భలే భలే మగాడివోయ్‌, మిథునం),  ఛాయాగ్రహణం : సాయి రామ్ ఉదయ్‌ (రాజు యాదవ్‌ ఫేం) - విజయ భాస్కర్ సద్దాల, సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌ (క్రేజీ ఫెలో, మైల్స్‌ ఆఫ్‌ లవ్‌), నిర్మాణ సంస్థలు : ఫస్ట్‌ కాపీ మూవీస్‌ - బి ద వే ఫిల్మ్స్‌ - వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, నిర్మాతలు : నరేష్ బాబు పి - రవి చైతన్య, దర్శకత్వం: శ్రీనివాస్‌ గోపిశెట్టి.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial