'బెదురులంక 2012' విజయం తనకు సంతోషాన్ని, అంతకు మించి కాన్ఫిడెన్స్  (Bedurulanka 2012 Movie)ను ఇచ్చిందని యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) తెలిపారు. ఆయన హీరోగా నటించిన సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ విజయం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేశారు. 


నేహా శెట్టి ఎందుకు రాలేదంటే?
'బెదురులంక 2012' సక్సెస్ మీట్ (Bedurulanka 2012 Success Meet)కు హీరోయిన్ నేహా శెట్టి రాలేదు. ఆమె కుటుంబంలో ఎమర్జెన్సీ ఉండటం వల్ల రాలేకపోయిందని కార్తికేయ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''విజయాలు వచ్చినప్పుడు మన దగ్గరకు ఎక్కువ సినిమాలు వస్తాయి. అయితే... మనం ఊహించినది జరిగినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపై మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. 'బెదురులంక 2012' కథ విన్నప్పుడు ఏ సన్నివేశాలకు ప్రేక్షకులు నవ్వుతారు? ఏయే సన్నివేశాలకు ఎటువంటి స్పందన వస్తుందని ఊహించానో... అదే జరిగింది. సెకండాఫ్ చాలా ఎంజాయ్ చేశామని ఎక్కువ మంది ప్రేక్షకులు చెబుతున్నారు. ఇటువంటి సీరియస్ విషయాన్ని వినోదంతో చెప్పడం నేను గతంలో చూడలేదు. నాకు ఈ సినిమా ఇచ్చిన నిర్మాత బెన్నీకి, ఎంతో సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థాంక్స్'' అని చెప్పారు.   


మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి కార్తికేయ వీరాభిమాని అని తెలిసిన విషయమే. 'బెదురులంక 2012'లో ఓ సన్నివేశంలో చిరంజీవి ఒరిజినల్ పేరును ఆయన చెప్పారు కూడా! ఆయన పేరు పెట్టుకున్నందుకు మెగా ఫ్యాన్స్ తనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారని కార్తికేయ సంతోషం వ్యక్తం చేశారు. ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్ కు సైతం థాంక్స్ చెప్పారు. 


Also Read : హారర్ థ్రిల్లర్ సినిమాతో రాజమౌళి హీరోయిన్ రీ ఎంట్రీ - లుక్ చూశారా?


సినిమా విజయవంతం కావడం ఎంతో సంతోషంగా ఉందని చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ప్రేక్షకులకు, మా సినిమాకు పని చేసిన వాళ్ళకు, ఈ సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి థాంక్స్. మా సినిమా విజయవంతం కావడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.  


నా తొలి సక్సెస్ మీట్ ఇది - 'ఆటో' రామ్ ప్రసాద్
తన జీవితంలో తొలి సక్సెస్ మీట్ ఇదని, ఇంతకు ముందు హిట్ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసినప్పటికీ, ఆయా సక్సెస్ మీట్లకు వెళ్లలేదని, ఇప్పుడు తన ఫోటో పోస్టర్ మీద ఉన్న సినిమా 'బెదురులంక 2012' సక్సెస్ మీట్ తన తొలి సక్సెస్ మీట్ కావడం సంతోషంగా ఉందని 'జబర్దస్త్' నటుడు, 'ఆటో' రామ్ ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాలో కార్తికేయ బాగా నటించారని, ఆయన ఫ్రెండ్లీ హీరో అని పేర్కొన్నారు. 


'ఆర్ఎక్స్ 100' చూసి కార్తికేయ ఫ్యాన్ అయ్యా - రాజ్ కుమార్ కసిరెడ్డి
'ఆర్ఎక్స్ 100' సినిమా విడుదలైన సమయానికి తాను సినిమాల్లోకి రాలేదని నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డి చెప్పారు. అందులో కార్తికేయ నటన చూసి తాను అభిమానిని అయ్యానని, 'బెదురులంక 2012'లో ఆయనతో కలిసి నటించడం, తాను పోషించిన పాత్రకు రెస్పాన్స్ బావుండటం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, దర్శకుడు క్లాక్స్ తదితరులు పాల్గొన్నారు.


Also Read 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ రివ్యూ : పోలీస్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా హిట్టా? ఫట్టా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial