అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అక్కాచెల్లెళ్లను కంటిరెప్పలా చూసుకుంటారు సోదరులు. ఒక్కసారిగా వారు దూరమవుతారని తెలిస్తే తట్టుకోలేరు. శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ కూడా అదే చేశాడు. చెల్లి పెళ్లిలో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. చెల్లి అత్తారింటికి వెళ్తుందన్న దు:ఖంలో... అమె ప్రేమతో హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


 






వనిందు హసరంగ... తన చెల్లి పెళ్లి అప్పగింతల కార్యక్రమంలో భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. చెల్లి కాళ్లకు మొక్కిన తర్వాత... ఆమెను దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు. అన్నాచెల్లెళ్లిద్దరూ ఏడ్చేశారు. చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ హసరంగ తన బావపై మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పెళ్లి హాజరైన బంధువులు వీడియో తీసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆగస్టు 30 నుంచి శ్రీలంక, పాకిస్థాన్‌ వేదికగా జరిగే ఆసియా కప్‌ ప్రారంభంకానుంది. ప్రస్తుతం అతడు తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని శ్రీలంక జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఐపీఎల్ లో 2021 నుంచి బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.