అన్వేషించండి

Telangana Rajyasabha Elections : తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో ట్విస్టులు ఖాయమే - ఒక్క స్థానం కోసం ఫిరాయింపులు తప్పవా ?

Telangana Politics : తెలంగాణలో మార్చిలో 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ లకు చెరొక్క సీటు ఖాయం. మరి మరో సీటు ఎవరికి దక్కుతుంది ?

Telangana Rajyasabha Elections Twist :  తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు రాజకీయంగా కాక రేపే అవకాశాలు  కనిపిస్తున్నాయి.  వచ్చే ఏడాది ఏప్రిల్‌ రెండో తేదీన తెలంగాణకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌ పదవీకాలం ముగియనుంది. వీరిస్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంది. అంత కంటే ముందే అంటే మార్చిలోనే రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల హడావుడి కూడా అప్పుడే పతాక స్థాయిలో ఉంటుంది. అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారానికి వెళ్లే సమయం మార్చిలోనే ఉంటుంది. అప్పుడు  పొలిటికల్ ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. ఎవరైనా ఎమ్మెల్యేలు అటూ ఇటూ జంపింగ్ చేస్తే ఫలితాల్లో తేడాలు వచ్చేస్తాయి. 

ఒక్కో స్థానం గెలవడానికి 40 మంది సభ్యుల మద్దతు అవసరం 

తెలంగాణలో  రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కొక్కరికి నలభై మంది మద్దతు తెలిపితే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో కలిసి 65 మంది ఎమ్మెల్యేలు,  బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి ఏడుగురు ఉన్నారు. రాజ్యసభ బరిలో ఒక అభ్యర్థిని బరిలోకి దింపడానికి 10 మంది శాసనసభ్యులు ఆయన పేరును ప్రతిపాదించాలి.  బీజేపీ, మజ్లిస్ పోటీ  చేసే అవకాశం ఉండదు. బీజేపీ పోటీ చేయదు.. అలాగని అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థులకు కానీ మద్దతుగా ఓటేసే అవకాశం ఉండదు. మజ్లిస్ ఏ నిర్ణయం తీసుకుంటుందని చెప్పలేం.  సాధారణంగా మజ్లిస్ అధికారంలో ఉన్న పార్టీకే మద్దతుగా ఉంటుంది. అధికార పార్టీతో గొడవలు పెట్టుకోదు. అంతగా కావాలంటే.. ఎన్నికలను బహిష్కరించవచ్చు. ఈ రెండు పార్టీలకు చెందిన 15  మందిని  లెక్కలోంచి తీసేస్తే.. 104 మంది సభ్యుల ప్రకారం చూస్తే.. ఒక్కొక్కరి 35  మంది అభ్యర్థులు సరిపోతారు. ఈ లెక్కన బీఆర్ఎస్‌కు ఒకటి ఖాయం.  పోటీ ఉండదు కాబట్టి మిగిలిన రెండూ కాంగ్రెస్‌కు ఖాయం. అయితే ఎవరూ పోటీ చేయకపోతేనే . ఎవరైనా పోటీ చేస్తే మాత్రం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే. కానీ కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి ఆ పార్టీకి ముప్పు లేదు.  ఆ పార్టీనే బీఆర్ఎస్‌తో చెలగాటం ఆడే అవకాశం ఉంది. 

ఎన్నికల తర్వాత నా ప్రత్యర్థుల్ని వదలను, ఏరివేస్తా - ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

రిస్క్ తీసుకోకపోతే కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్‌కు ఒకటి 

మూడు స్థానాలు ఖాళీ అవుతున్నందున ముగ్గురే అభ్యర్థులు బరిలో నిలిస్తే పోలింగుతో, సంఖ్యాబలంతో సంబంధం లేకుండా వారి ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ముగ్గురికి మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగ్ అనివార్యమవుతుంది. అప్పుడు మొదటి మూడు స్థానాల్లో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. కాంగ్రెస్‌కు ఒక స్థానం గెలిచే ఓట్ల కంటే మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది.   బీఆర్ఎస్​కు ఒక స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో ఆరు ఓట్లే ఉన్నందున అది రెండోస్థానానికి పోటీ చేసే వీలు ఉండదు. ఈ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్‌ రెండు, బీఆర్ఎస్ ఒక స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.   కాంగ్రెస్‌ మూడు స్థానాలకు పోటీ చేసినా బీఆర్ఎస్ రెండు స్థానాలకు పోటీ చేసినా ఎన్నికలు ఉత్కంఠగా మారుతాయి.

రాజ్యసభ ఎన్నికల  ప్రక్రియ భిన్నం 

రాజ్యసభ ఎన్నికల్లో  పోలైన ఓట్లలో  గెలవడానికి ఓ అభ్యర్థి  నిర్దిష్ట సంఖ్యలో మొదటి ప్రాధాన్యత ఓట్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. ముగ్గురు అభ్యర్థులకు నలుగురు పోటీలో ఉండి.. వంద మంది ఓట్లేస్తే మొదటి రౌండ్ పోల్స్‌లో, ప్రతి మొదటి ప్రాధాన్యత ఓటు విలువ 100 పాయింట్లుగా నిర్ణయిస్తారు. అభ్యర్థి ఓటు వేసిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను ఎన్నికలు జరిగే సీట్ల సంఖ్యతో డివైడ్‌ చేయడం ద్వారా పొందిన కోటీన్ కంటే ఒక పాయింట్ ఎక్కువ సాధించాలి. కౌంటింగ్ తర్వాత ఎవరికి ఎక్కవ పాయింట్లు వస్తాయో ఆ ముగ్గిరినే విజేతగా ప్రకటిస్తారు.

మద్యం అమ్మకాల లెక్కలు మాయం - సీఎస్‌కు అచ్చెన్నాయుడు ఘాటు లేఖ !

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఫిరాయింపులు ఉండే అవకాశం 

పార్మెంట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే రాజ్యసభ ఎన్నికలు వస్తున్నందున ఆ సమయంలో ఫిరాయింపులు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ తో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లోకి వచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ కు అవసరమైనప్పుడు మద్దతు ఇస్తానని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రకరకాల సమస్యలు ఉన్నాయి. వారు ప్రభుత్వంపై  యుద్ధం చేయలేకపోవచ్చు. అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ ఆకర్షించడం పెద్ద విషయం కాదన్న అభిప్రాయం ఉంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మూడో స్థానం కోసం కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడితే మాత్రం రాజకీయం రచ్చ అవుతుంది. 

అయితే కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది నాలుగైదు మంది ఎమ్మెల్యేలు అయితే ఇలాంటి రిస్క్ తీసుకోవచ్చు కానీ..  ఇరవై మందికిపైగా ఆకర్షించి అభ్యర్థిని  నిలబెట్టడం సరి కాదన్న అంచనాలు సహజంగానే వస్తాయి. అందుకే  కాంగ్రెస్‌, బీఆర్ఎస్ తమ బలానికి తగ్గట్లుగా అభ్యర్థులను నిలిపి ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికే మొగ్గు చూపే వీలుంది. రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌​లో భారీ సంఖ్యలో ఆశావహులున్నారు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | IPL 2024 లో ఇన్ని సార్లు 250+ స్కోర్లు రావటానికి కారణాలేంటీ.? | ABPKKR vs PBKS Match Highlights | సరికొత్త చరిత్ర రాసిన కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ | IPL 2024 | ABP DesamKKR vs PBKS Match Highlights | Shashank Singh ఊచకోత ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఊపిరి | IPL 2024 | ABPKKR vs PBKS Match Highlights | చరిత్ర చూడని ఛేజింగ్ తో కోల్ కతా ఫ్యూజులు ఎగిరిపోయాయి | IPL 2024 |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
Special Trains: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ ఇవే..!
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ ఇవే..!
Sukumar About Suhas: కేశ‌వ‌ క్యారెక్ట‌ర్ సుహాస్ చేయాల్సింది.. బ‌న్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్ట‌ర్ సుకుమార్
కేశ‌వ‌ క్యారెక్ట‌ర్ సుహాస్ చేయాల్సింది.. బ‌న్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్ట‌ర్ సుకుమార్
Varalaxmi Sarathkumar: చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను, థెరపీకి వెళ్లాను - వరలక్ష్మి శరత్‌కుమార్
చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను, థెరపీకి వెళ్లాను - వరలక్ష్మి శరత్‌కుమార్
YSRCP News Strategy: ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు
ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు
Embed widget