బిహార్ గయాలో నక్సలైట్లు దారుణానికి తెగబడ్డారు. మున్‌వార్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరి తీశారు. అంతేకాకుండా రెండు ఇళ్లలను డైనమైట్లతో పేల్చేశారు. ఈ దాడిని ప్రతీకార చర్యగా పోలీసులు భావిస్తున్నారు.
సీపీఐ-మావోయిస్టులు అనే నిషేధిత నక్సలైట్ సంస్థ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 2021 మార్చి 16న నలుగురు నక్సలైట్లు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. దానికి ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడ్డారు మావోయిస్టులు. ఆ ఎన్‌కౌంటర్‌లో ఈ కుటుంబం ఇన్ఫార్మర్లుగా వ్యహరించినందుకే ఇలా జరిగిందని మావోయిస్టులు పోస్టర్ అంటించారు. గ్రామంలో ఎవరైనా తమకు నమ్మక ద్రోహం చేస్తే వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
పోస్టర్‌లో..
ఈ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే తాము సర్జు సింగ్ భోక్తా ఇంటిపై దాడి చేశామని కరపత్రంలో మావోయిస్టులు పేర్కొన్నారు. మరణించిన నలుగురిని సర్జు సింగ్ ఇద్దరు కుమారులు సాతిందర్ సింగ్ భోక్తా, మహేంద్ర సింగ్ భోక్తా, వారి భార్యలుగా గుర్తించారు.
భయంభయం..
ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఎస్పీ ఆదిత్య కుమార్, ఎస్పీ రాకేశ్ కుమార్ పరిస్థితిని పర్యవేక్షించారు. పదుల సంఖ్యలో సిబ్బందితో గ్రామంలో పహారా కాస్తున్నారు.
దాదాపు 25 మంది నక్సలైట్లు సమూహంగా వచ్చి ఈ నలుగురిని ఉరి తీసినట్లు గ్రామంలోని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
గతంలోనూ మార్చ్‌గా వచ్చి బెదిరించినట్లు వెల్లడించారు. నక్సలైట్ల చర్యతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.
Also Read: FIR Against Shilpa-Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి దంపతులు.. చీటింగ్ కేసు నమోదు
Also Read: Amit Shah Andhra Visit: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'
Also Read: Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి
Also read: ABP-CVoter Survey: యూపీ భాజపాకే.. కానీ 100 సీట్లు హాంఫట్.. పంజాబ్‌లో ఒకటి కూడా కష్టమే!
Also read: తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?
Also read: గోల్డెన్ అవర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...
Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి