Meta Layoffs: 


వేలాది మంది తొలగింపు..


ఈ ఏడాది మొదటి నుంచే అన్ని ఐటీ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. వేలాది మంది ఉద్యోగులను విడతల వారీగా తొలగిస్తూ వస్తున్నాయి. మెటాలో  (Meta Layoffs)ఈ సంఖ్య భారీగా ఉంది. ఇప్పటి వరకూ 20 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది ఈ సంస్థ. ఈ లేఆఫ్‌లు జరిగిన తీరుపై ఇప్పటికే చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. లింక్డ్‌ఇన్‌లో (LinkedIn) ఎక్స్ ఎంప్లాయీస్‌ పెద్ద పెద్ద పోస్ట్‌లు పెట్టి మెటాపై మండి పడ్డారు. వీరిలో ఇప్పటికీ ఉద్యోగం రాక నానా ఇబ్బందులు పడుతున్న వాళ్లున్నారు. మెటా మాజీ ఉద్యోగి ఒకరు...లింక్డ్‌ఇన్‌లో ఇదే పోస్ట్ పెట్టారు. జాబ్ నుంచి తీసేసి 200 రోజులు పూర్తైనా ఇప్పటికీ ఒక్క అవకాశం కూడా దొరకలేదని, మార్కెట్‌ చాలా దారుణంగా ఉందని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా మనుషులతో కలవడం పూర్తిగా తగ్గిపోయిందని, వర్క్ కల్చర్‌ని ఆ వాతావరణాన్ని మిస్‌ అవుతున్నానని చెప్పారు. రెండేళ్ల పాటు ఫేస్‌బుక్‌లో టెక్నికల్ రిక్రూటర్‌గా పని చేసిన ఆ యువతి...సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. 


"నన్ను ఉద్యోగంలో నుంచి తీసేసి 201 రోజులైంది. అప్పటి నుంచి నేను కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. దాదాపు ఆరున్నర నెలల పాటు చాలా వెతికాను. కానీ...ఇంకా ఆగిపోయిన చోటే ఉన్నాను. త్వరలోనే కొత్త ఉద్యోగం వస్తుందన్న ఆశతో ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాను. పని చేయడాన్ని చాలా మిస్ అవుతున్నా. పని వాతావరణాన్నీ మిస్ అవుతున్నా"


- మెటా మాజీ ఉద్యోగి 


మరో రౌండ్ లేఆఫ్‌లు..?


ఈమె ఒక్కరే కాదు. లేఆఫ్‌కి గురైన ఉద్యోగులంతా ఇలా లింక్డ్‌ఇన్‌లో వరుస పెట్టి పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా...మెటా మాత్రం ఇంకా ఉద్యోగాల కోతను ఆపడం లేదు. మరో రౌండ్ లేఆఫ్‌లకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 3వ తేదీనే ఉద్యోగులకు హింట్ కూడా ఇచ్చినట్టు సమాచారం. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకూ సుమారుగా 21 వేల మంది ఉద్యోగులను తొలగించింది మెటా. 


 మెటా (Meta) ఉద్యోగులను కఠినంగా హెచ్చరించింది. వర్క్ ఫ్రమ్‌ ఆఫీస్‌ పాలసీని పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కరోనా వైరస్‌ ఆవిర్భావంతో ప్రపంచ వ్యాప్తంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) సంస్కృతి పెరిగింది. ఉత్పత్తి పెంచేందుకు కంపెనీలు ఇంటి వద్ద నుంచే పనిని ప్రోత్సహించాయి. గతేడాది నుంచి కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రమ్మని కోరుతున్నాయి. ఒక వేళ వీలు కాకుంటే వారంలో కనీసం మూడు రోజులైనా రావాలని అడుగుతున్నాయి. దీనిని కొందరు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఆఫీసులకు రావడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్‌ నుంచి పనిచేయాలని ఫేస్‌బుక్‌ నిబంధన పెట్టింది. కొందరు ఉద్యోగులు దీనిని లైట్‌ తీసుకున్నారని సమాచారం. ఇలాంటి వారికి మెటా మానవ వనరుల అధినేత లోరీ గోలెర్‌ మెమోలు జారీ చేశారని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ రిపోర్టు చేసింది.


Also Read: కెనడా ప్రధాని ట్రూడోకి ఊహించని షాక్, దేశాన్ని నాశనం చేశావంటూ ఓ వ్యక్తి వాగ్వాదం