AP EAPCET Results | కాకినాడ: ఇటీవల తెలంగాణలో సెట్ ఫలితాలు విడుదల కాగా, తాజాగా ఏపీ ఈఏపీసెట్-2025 ఫలితాలు (AP EAPCET Results) విడుదలయ్యాయి. ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎగ్జామ్ లో ర్యాంక్, మెరిట్ సాధించాల్సి ఉంటుంది. జేఎన్టీయూ కాకినాడ (JNTU Kakinada) వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ జూన్ 8న (ఆదివారం) సాయత్రం ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేశారు.
రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx
ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ కోసం డైరెక్ట్ లింక్ https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetRankCard.aspx
ఏపీ ఈఏపీసెట్-2025 పరీక్షల్లో 75.67శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్‌లో కలిపి 145 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించారు. ఏపీ ఈఏపీసెట్ కు 3,62,448మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే 3,40,300 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,57,509 మంది అర్హత సాధించారని వీసీ వెల్లడించారు. పరీక్షలు నిర్వహించిన కేవలం 12 రోజుల్లోనే రిజల్ట్స్ విడుదల చేయడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,64,840 మంది పరీక్ష రాయగా 1,89,748 మంది అర్హత సాధించారు. అర్హత శాతం 71.65 అని తెలిపారు. మరోవైపు మే 19, 20 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మా ఎగ్జామ్స్‌కు 75,460మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 67,761 మంది అంటే 89.80 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.