Andhra Pradesh News | విజయవాడ: విజయవాడలో నడిరోడ్డుపై యువకులు కత్తులతో వీర విహారం చేశారు. గంజాయి బ్యాచ్ పట్టపగలే జనాలపై బీరు బాటిళ్లు విసిరి వీరంగం సృష్టించింది. గంజాయి బ్యాచ్ పిచ్చి చేష్టలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఇబ్బందులకు గురవుతంటే పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రాణాలకు రక్షణ కరువైందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్..
విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఈ సంఘటన జరగడంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ గంజాయి బ్యాచ్ గొడవలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. నిత్యం ఏదోచోట గంజాయి బ్యాచ్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే.. అదుపు చేయలేక చోద్యం చూస్తున్నారంటూ పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్రీస్తురాజపురం, ఆల్ఫా టీ క్యాంటీన్ వద్ద మద్యం మత్తులో యువకులు బీర్ బాటిల్స్ విసురుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు పరస్పరం కత్తులతో దాడులు చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మొదట గొడవపడ్డ యువకులు తరువాత బీర్ సీసాలను ప్రజల మీదకు కూడా విసరండతో అసలేం జరుగుతుందో అర్థంకాక ఆందోళన చెందారు. ప్రజలు ఇప్పటికైనా ఇలాంటి గంజా బ్యాచ్, బ్లేడు బ్యాచ్‌ల మీద చర్యలు తీసుకుంటే సమస్య తగ్గుతుందని చెబుతున్నారు.
Also Read: CM Chandrababu: వైసీపీ హయాంలో పోరాటం చేశారనే మహిళలపై దారుణవ్యాఖ్యలు! కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు