2024 పార్లమెంటు ఎన్నికల్లో భాజపాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ X భాజపాగా ఉన్న ఎన్నికల యుద్ధాన్ని టీఎంసీ X భాజపాగా మార్చేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే పార్టీని వివిధ రాష్ట్రాల్లో విస్తరించే పనిలో ఉన్నారు దీదీ.  


మేఘాలయలో ప్రతిపక్షంగా..


మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది బుధవారం రాత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇందులో చేరిన వారిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా ఉండడం పెద్ద విషయం. తృణమూల్‌లో చేరడంపై అసెంబ్లీ స్పీకర్‌కు ఇప్పటికే లేఖ రాసినట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.


మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీకీ 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేరికతో తృణమూల్‌ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. దీంతో 2023లో రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో టీఎంసీ బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది.


మూడోసారి.. 


బంగాల్‌లో హ్యాట్రిక్ విజ‌యం సాధించిన మ‌మ‌తాబెన‌ర్జీ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈసారి టార్గెట్ 2024 అంటూ సంకేతాలు ఇస్తున్నారు. బంగాల్ లో ఓటర్లు ఇచ్చిన జోష్‌తో దిల్లీ కోటలను బద్దలు కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.


ప్రస్తుతం దేశంలో భాజపాను ఎదుర్కొని ముఖ్యంగా మోదీ-షా ద్వయాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి ఏ పార్టీకి లేదన్నది విశ్లేషకుల మాట. అయితే కాంగ్రెస్‌కు ఆ శక్తి ఉన్నా ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో దీదీపై దేశవ్యాప్త ప్రజాదరణ ఉందని, మోదీని ఎదుర్కొనే సత్తా ఆమెకే ఉందని దాదాపు అన్ని విపక్ష పార్టీలు అంగీకరిస్తున్నాయి. తాజాగా జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చూపిన తెగువే ఇందుకు సాక్ష్యం.


మోదీ X దీదీ..


బంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం దీదీ పేరు మార్మోగిపోతోంది. దాని కారణం ఆమె ప్ర‌త్య‌ర్థులు అత్యంత శ‌క్తిమంతులు కావ‌డ‌మే. దేశంలో త‌మ క‌త్తికి అడ్డే లేద‌ని విజ‌య‌యాత్ర సాగిస్తున్న మోడీ-అమిత్‌షా ద్వ‌యానికి బంగాల్ ఫైర్ బ్రాండ్ మ‌మ‌తాబెన‌ర్జీ తానున్నాన‌ని నిలువరించారు. ఇద్దరినీ మళ్లీ హస్తినకు పంపారు. అందుకే మ‌మ‌తా బెన‌ర్జీ పేరు క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కూ వినిపిస్తోంది.


ఆ విజయం ప్రత్యేకం..


బంగాల్‌లో మ‌మ‌తాబెన‌ర్జీ సాధించిన విజ‌యం ఎంతో ప్ర‌త్యేకం. భ‌విష్య‌త్ ఆశాకిర‌ణంగా మ‌మ‌తా బెన‌ర్జీ తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. అస‌లు మోదీ -అమిత్‌షా ద్వ‌యానికి అడ్డే లేదా అనే ప‌రిస్థితుల్లో మ‌మ‌త రూపంలో ఓ ప్ర‌త్యామ్నాయం తెర‌పైకి వ‌చ్చింది. మోదీ- షా ద్వ‌యం ఓట‌మికి అతీతం కాద‌ని మ‌మ‌త నిరూపించారు. 


మ‌మ‌త‌ను ఓడించ‌డానికి మోదీ -అమిత్‌షా ద్వ‌యం ప్ర‌యోగించ‌ని అస్త్రాలు లేవు. కానీ ఆ మ‌హిళా శ‌క్తి ఎదుట వాళ్లిద్ద‌రి పాచికలు పారలేదు. 200కు పైగా సీట్లు సాధించి బంగాల్ ప‌వ‌ర్ ఏంటో వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసుకుంటున్న బీజేపీకి రుచి చూపించారామె. మరి 2024 ఎన్నికల్లో దీదీ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి.


Also Read: Noida International Airport: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి మోదీ శ్రీకారం.. ఆ రికార్డ్ యూపీదే!


Also Read: Kangana Ranaut: కంగనాకు దిల్లీ అసెంబ్లీ సమన్లు.. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం


Also Read: NEET Counselling 2021 Postponed: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్‌'పై కేంద్రం పునరాలోచన!


Also Read: Toilet Paper: బాబూ చిట్టీ.. ఇదేం రాజీనామా లేఖ నాయనా.. రాసేందుకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా?


Also Read: INS Vela Pics: భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ వేలా.. ఇది చాలా స్పెషల్ గురూ!


Also Read: Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం