నెల్లూరు జిల్లా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. తాగిన డబ్బుతో ఇచ్చే సంక్షేమ పథకాలు ఎవరడిగారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా.. పెళ్లకూరు, నాయుడుపేట, గూడూరు, వెంకటాచలంలో చంద్రబాబు మాట్లాడారు. ఓ వైపు మద్యపాన నిషేధం అని చెబుతున్న ప్రభుత్వం.. తాగిన డబ్బుతో వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఇవ్వడమేంటన్నారు.


తండ్రి తాగితేనే అమ్మ ఒడి ఇస్తాననడం దారుణం. తాగిన డబ్బుతో ఇచ్చే సంక్షేమ పథకాలు ఎవరికి కావాలి. పేదల రక్తంతో ఇచ్చే సంక్షేమ పథకాలు అవసరమా ? కొత్త  పథకాలు పెట్టే విచిత్రమైన మనిషి జగన్‌ రెడ్డి. నేను ప్రజల కోసమే ఉన్నాను. బెదిరింపులకు భయపడను. 
                                                      - చంద్రబాబు, టీడీపీ అధినేత






వైసీపీ ప్రభుత్వం కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతుందని.. వాటితో జీవితాలు నాశనం అవుతాయని ఆరోపించారు. తండ్రి తాగితే పిల్లలకు అమ్మఒడి, మీరు తాగితేనే మీ పిల్లలకి చదువు అనేలాంటి కొత్త పథకాలు పెట్టే విచిత్రమైన వాళ్లని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో కొత్త కష్టాలు ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  ప్రజల కోసం తాను ఉన్నానని.. ఎవరి బెదిరింపులకు అసలు బయటపడొద్దని సూచించారు.


Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !


Also Read: Pocharam Corona : తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు కరోనా ! తెలుగు రాష్ట్రాల సీఎంలకు తప్పని టెన్షన్ !


Also Read: Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !


Also Read: నిద్రసరిగా పట్టడం లేదా... ఆహారంలో ఉప్పు తగ్గించండి



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి