Andhra Pradesh News Today: ఎగ్జిట్‌పోల్స్‌పై పెరుగుతున్న అంచానాలు, గత ఎన్నికల్లో ఏ సంస్థల అంచనాలు నిజమయ్యాయి
జూన్ 4 న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నా...అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది మాత్రం జూన్ 1న విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్‌ గురించే. నేటితో సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ ముగియనుండటంతో సాయంత్రం అన్ని సర్వే సంస్థలు  ముందస్తు ఫలితాలు  విడుదల చేయనున్నాయి. ముందస్తు సర్వే ఫలితాలకు కొంచెం అటుఇటుగానే  అసలు ఫలితాలు వస్తుండటంతో ఎగ్జిట్ పోల్స్‌పై అందరిలోనూ ఆసక్తి రేగుతోంది. కొన్ని సంస్థలు నిఖార్సుగా సర్వేలు నిర్వహించి అందరి మన్నలను పొందుతుండగా...కొన్ని సంస్థలు లెక్కలు తప్పుతుంటాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పోస్టల్ బ్యాలట్‌ రూల్స్‌పై కోర్టు తీర్పు ఏంటి? ఈసీ నుంచి అందరిలో ఒకటే ఉత్కంఠ
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఏపీ హైకోర్టు(AP High Court) శనివారం సాయంత్రం కీలక తీర్పు వెలువరించనుంది. ఓటర్ డిక్లరేషన్‌కు సంబంధించిన వైసీపీ (YSRCP)నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యంపై  విచారణ జరిపిన హైకోర్టు...నేడు తీర్పు వెలువరించనుంది. పోస్టల్ బ్యాలట్ (Postal Ballot)ఓట్ల లెక్కింపు చేసేప్పుడు ఓటర్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఫాం-13Aపై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా  పర్వాలేదని...ఆ అధికారి సంతకం ఉంటే చాలని మే 30న తాము ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనల మేరకే ఉన్నాయని ఎన్నికల సంఘం(CEC) తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'ద బిల్ ఈజ్ పాస్‌డ్' - ఈ మాట వెనుక అలుపెరుగని పోరాటం, ఎందరిదో త్యాగం!
'ద బిల్ ఈజ్ పాస్‌డ్'.. అవును ఈ మాట వింటే ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడి మనసు ఉప్పొంగుతుంది. ఎన్నో పోరాటాలు, ఎందరివో ఆత్మ బలిదానాలు, ఎన్నో ఉద్యమాలు, విద్యార్థుల నిరసనలు, నిరుద్యోగుల ఆర్తనాదాలు. 'మా నిధులు, మా నీళ్లు, మా ఉద్యోగాలు మాకే కావాలి'.. అంటూ ఎందరో ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రమే ఊపిరిగా.. తెలంగాణ ఆవిర్భావమే శ్వాసగా అలుపెరుగని పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ సమావేశం- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం
పదేళ్ల తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ గవర్నర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ ఉదయం జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి బయల్దేరి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. వేడకగా నిర్వహిస్తున్న ఆవిర్భావ ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తాడిపత్రిలో కౌంటింగ్ టెన్షన్ - ప్రధాన నేతలంతా ముందస్తు బెయిళ్ల పైనే !
ఆంధ్రప్రదేశ్ లో  హైవోల్టేజ్ రాజకీయం  జరిగే నియోజకవర్గాల్లో ఒకటి తాడిపత్రి. పోలింగ్ రోజు అభ్యర్థులు ఒకరి ఇళ్లను మరొకరు ఆక్రమించుకుని  చేసిన రాజకీయం చూసిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా అని అందరూ ఆశ్చర్యపోయారు. కౌంటింగ్త తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయలేకపోతున్నారు. అభ్యర్థులు ఎవరూ తాడిపత్రిలో ఉండే పరిస్థితి  లేదు. అందరూ ఔటాఫ్ స్టేషనే. కీలక నేతలంతా ముందస్తు బెయిల్స్ పై ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి