Andhra Pradesh Assembly And Lok Sabha Elections Exit Poll Result 2024: జూన్ 4 న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నా...అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది మాత్రం జూన్ 1న విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ గురించే. నేటితో సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ ముగియనుండటంతో సాయంత్రం అన్ని సర్వే సంస్థలు ముందస్తు ఫలితాలు విడుదల చేయనున్నాయి. ముందస్తు సర్వే ఫలితాలకు కొంచెం అటుఇటుగానే అసలు ఫలితాలు వస్తుండటంతో ఎగ్జిట్ పోల్స్‌పై అందరిలోనూ ఆసక్తి రేగుతోంది. కొన్ని సంస్థలు నిఖార్సుగా సర్వేలు నిర్వహించి అందరి మన్నలను పొందుతుండగా...కొన్ని సంస్థలు లెక్కలు తప్పుతుంటాయి. గత ఎన్నికల్లో ఏయే సంస్థల అంచనాలు నిజమయ్యాయో ఒకసారి చూద్దాం...
ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శనివారంతో ముగియనున్న నేపథ్యంలో అదేరోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ విడుదలకు ఈసీ అంగీకరించింది. వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో తిరిగి సేకరించిన వివరాలను విడుదల చేయనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. రాజకీయ పార్టీలు గెలుపు మాదంటే మాదని పదేపదే ఊదరగొట్టగా...ఇప్పుడు వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు దగ్గరిగానే ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో సగం గెలుపు నేడు ఖరారైనట్లే.
అయితే ఈ ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నూటికి నూరుశాతం నిజమైన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. ఇంకా చెప్పాలంటూ గతంలో దారుణంగా ఈ అంచనాలు తప్పినా....ప్రజల్లో మాత్రం వీటిపై క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.
ప్రీపోల్స్..ఎగ్జిట్ పోల్స్‌కు తేడా ఏంటంటే....ప్రీపోల్స్‌లో మీరు ఓటు ఎవరికి వేస్తారని అడిగి సమాచారం సేకరిస్తారు. కానీ ఎగ్జిట్‌పోల్స్‌లో మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరికి ఓటు వేశారన్న సమాచారం ఆధారంగా వీటిని క్రోడీకరించి ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఆయా సంస్థల ప్రమాణికతపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సంస్థలు ముందుగానే కొన్ని పార్టీలతో ఒప్పందం చేసుకుని వారి కోసం సర్వే చేస్తుంటాయి. అలాగే శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు..? ఎక్కడెక్కడ తీసుకున్నారు...? ఏయే వర్గాల నుంచి తీసుకున్నారు...? అనే అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.
ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు కొన్నిసార్లు నిజమైతే...మరికొన్నిసార్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. 1998 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కూటమి గెలుపు ఖాయమని చెప్పడంతోపాటు సర్వే సంస్థలు వెల్లడించిన సంఖ్యకు దగ్గరగానే సీట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. అలాగే 2019 ఎన్నికల్లోనూ దాదాపు దగ్గరగా అంచనా వేశారు. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ, బెంగాల్‌లో ఖచ్చితంగా అంచనా వేశారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పాయి. అయితే 2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించగా...అందరి అంచనాలు తప్పని రుజువు చేస్తూ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సర్వే సంస్థలు బోల్తాపడ్డాయి. భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా....చేయిచేయి కలిపిన నితీశ్, లాలూ కూటమి గెలుపొందింది. 2017 యూపీ ఎన్నికల్లోనూ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. అలాగే 2020 బిహార్ ఎన్నికల్లోనూ సెఫాలిజిస్టులు బోల్తాపడ్డారు.
లోక్‌సభ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు
|
| 2014 | 2019 | ||||
|
| భాజపా | కాంగ్రెస్ | ఇతరలు | భాజపా | ఇతరలు | |
| ఇండియా టుడే | 272 | 115 | 156 | 339-365 | 77-108 | 69-95 |
| 24 చాణిక్య | 340 | 70 | 133 | 350 | 95 | 97 |
| టైమ్స్‌నౌ | 249 | 148 | 146 | 306 | 132 | 104 |
| ఏబీపీ న్యూస్ | 274 | 97 | 165 | 267 | 127 | 148 |
| ఇండియా టీవీ | 289 | 101 | 148 | 300 | 120 | 122 |
| ఎన్డీటీవీ | 279 | 103 | 161 | 302 | 122 | 118 |
| సీఎస్‌డీఎస్ | 280 | 97 | 148 | 277 | 130 | ---- |
| రిపబ్లిక్-సిఓటర్ | ---- | ------ | ------ | 287 | 128 | 127 |
| తుది ఫలితాలు | 336 | 59 | 148 | 352 | 91 | 99 |
2019 ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
|
| వైసీపీ | ||
| ఐఎన్‌ఎస్‌ఎస్ | 118 | 52 | 5 |
| సీపీఎస్ | 43-44 | 130-133 | 0-1 |
| వీడిపీ | 54-60 | 111-121 | 0-4 |
| ఆరా | 47-56 | 119-126 | 2 |
| ఇండియా టుడే | 37-40 | 130-135 | 0-1 |
| తుది ఫలితాలు | 23 | 151 | 1 |