Telangana News Today | గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి - కన్నుల పండువగా వేడుక, వేలాదిగా పాల్గొన్న భక్తులు
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రక్రియ ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద భారీ గణపయ్యను నిమజ్జనం చేశారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గౌరీపుత్రుని తనయుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. సూపర్ క్రేన్ ద్వారా 70 అడుగుల మహాశక్తి గణపతిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ చేరుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మంత్రి సంధ్యారాణి పుట్టిన రోజు వేడుకలు తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్ లో థూం..థాంగా జరిగాయని అందరూ తాగి గంతులేశారని వైసీపీ సోషల్ మీడియా సానుభూతిపరులు ఓ వీడియోను ప్రచారంలోకి పెట్టారు.ఈ వీడియో వైరల్ అయింది. అయితే నిజమేమిటంటే.. ఆ పుట్టిన రోజు వేడుకలు జరిగింది విజయవాడలోని మంత్రి నివాసంలో. కానీ తిరుమలలో జరిగాయంటూ ప్రచారం చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 'ప్రజాపాలన' దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత 'ఓ నిజాము పిశాచమా... కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని..' అన్న దాశరథీ కవితతో తన ప్రసంగం ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!
మేకపాటి రాజమోహన్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడే కాదు ప్రముఖ వ్యాపారవేత్త కూడా. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపత్తులు వచ్చినప్పుడు ఆయన తన కంపెనీల తరపున విరాళాలు ప్రకటిస్తుంటారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల వరద సహాయం కోసం మొత్తం రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు మేకపాటి. ఏపీ సీఎం చంద్రబాబుని నేరుగా కలిసి ఇచ్చేందుకు ఆయనకు రాజకీయం అడ్డొచ్చింది. అందుకే తన విరాళం చెక్ ని స్పీడ్ పోస్ట్ లో చంద్రబాబు అడ్రస్ కి పంపించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర - 30 లక్షల ఒక వెయ్యికి సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి
బాలాపూర్‌ గణపతి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు సృష్టించుకొని పైపైకి వెళ్తోంది బాలాపూర్‌ గణేష్ లడ్డూ. ఈసారి కూడా అందరి అంచనాలకు తగ్గట్టుగానే పోటాపోటీగా సాగింది వేలం. కొత్త తీసుకొచ్చిన రూల్ ప్రకారం ముందుగా గతేడాది లడ్డూ అమ్ముడుపోయిన ధర డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఈసారి వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. అందుకే చాలా తక్కువ మంది ఈ డబ్బులు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి