Actor Prabhakar And Malayaja Gets Emotional: ఫస్ట్ టైమ్ పిల్లలు స్కూల్ కు వెళ్తుంటే తల్లిండ్రులు ఎమోషనల్ అవుతారు. అలాగే తమ కొడుకు సినిమాల్లోకి అడుగు పెడుతుంటే తామూ అలాగే ఎమోనల్ అవుతున్నామన్నారు నటుడు ప్రభాకర్, మలయజ దంపతులు. వారి అబ్బాయి 'యాటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ నటించిన ‘రామ్ నగర్ బన్నీ‘ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో టీజర్ లాంఛ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రభాకర్ కీలక విషయాలు వెల్లడించారు.


దిల్ రాజు చెప్పినవన్నీ ఉంటాయి- ప్రభాకర్


గతంలో ఓ సినిమా గురించి దిల్ రాజు చెప్పినట్లు ఈ సినిమాలో అన్ని అంశాలు ఉంటాని ప్రభాకరం చెప్పుకొచ్చారు. “పిల్లుల తొలిసారి స్కూల్ కి వెళ్లేటప్పుడు ఎలాంటి తల్లిదండ్రులు ఎలా ఎమోషనల్ అవుతారో.. ఇప్పుడు మా అబ్బాయి సినిమాల్లోకి వస్తుంటే మేం అలాగే ఫీలవుతున్నాం. నా పిల్లలే నా వీక్ నెస్. వాళ్లు దగ్గర లేకపోతే నాకు నిద్రపట్టదు. డబ్బులు సంపాదించాలని ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేయడం లేదు. ఈ సినిమాలో దిల్ రాజు చెప్పినట్టు డ్యాన్స్ వేనుమా డ్యాన్స్ ఇరుక్కు, సాంగ్స్ వేనుమా సాంగ్స్ ఇరుక్కు,  డ్రామ వేనుమా డ్రామ ఇరుక్కు.. అన్ని ఉంటాయి.  ప్రజలు నన్ను ఎలా ఆదరిస్తారో, నా కొడుకును కూడా అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నాను” అని ప్రభాకర్ చెప్పారు.   



కోట్లు సంపాదించింది వాళ్ల కోసమే- ప్రభాకర్


‘రామ్ నగర్ బన్నీ‘ సినిమా ప్రేక్షకులకు అందరికీ నచ్చుతుందని ప్రభాకర్ చెప్పారు. “తొలి సినిమా యూత్ కంటెంట్ తో తెరకెక్కింది. కేవలం యూత్ కే నచ్చుతుంది. రెండో సినిమా లవ్ స్టోరీతో తీశారు. అది కూడా ఓ వర్గానికి నచ్చుతుంది. నా బిడ్డ చేయబోయే సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చూడాలి అనుకున్నాను. ఈ సినిమా అదే కంటెంట్ తో తెరకెక్కింది. ఇంత కాలం సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులను తాకట్టు పెట్టి ఈ సినిమాకు ఇన్వెస్ట్ చేయడం అవసరమా? అనే వారికి నా సమాధానం ఒకటే. నేను డబ్బులు సంపాదించింది నా పిల్లల కోసమే. వారి కోసమే ఖర్చుపెడతాను. మా అబ్బాయి ఇండస్ట్రీలోకి రావాలని గట్టి ప్రయత్నించాడు. అతడిలో ఫ్యాషన్ ఉంది. అందుకే నేను డబ్బులు పెడుతున్నాను. పేరెంట్స్ గా మనం వారికి సపోర్టు చేయకపోతే మరెవరు చేస్తారు? వాడి డెడికేషన్ నాకు నచ్చింది” అని చెప్పుకొచ్చారు.



అక్టోబర్ 4న ‘రామ్ నగర్ బన్నీ’ విడుదల


ఇక ‘రామ్ నగర్ బన్నీ’ సినిమాలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అశ్విన్ హేమంత్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను అష్కర్ అలీ నిర్వహించారు. అక్టోబర్ 4న ఈ సినిమా విడుదలకానుంది.  


Also Read: ఎన్టీఆర్‌కు కాదు, కొరటాలకే అగ్ని పరీక్ష... 'దేవర' రిజల్ట్ దర్శకుడి కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్