Actor Sasikumar: అప్పులు తీర్చడం కోసమే సినిమాల్లో నటించా... ఇప్పుడు డైరెక్షన్ మీద దృష్టి పెడతా - హీరో శశి కుమార్

తమిళ నటుడు శశి కుమార్ తాజాగా నటించిన ‘నందన్‌’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. తన ఆర్థిక ఇబ్బందుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Continues below advertisement

Actor Sasikumar About His Financial Problems: తమిళ నటుడు శశి కుమార్ తొలిసారి తన ఆర్థిక ఇబ్బందుల గురించి కీలక విషయాలు వెల్లడించారు. కోలీవుడ్ లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆర్థికంగా ఇప్పటికే కష్టాల్లోనే ఉన్నట్లు చెప్పారు. గత ఏడాది వరకు అప్పులు తీర్చేందుకే సినిమాల్లో హీరోగా నటించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అప్పుల బాధల్లో నుంచి కోలుకుంటున్నానని చెప్పారు.  

Continues below advertisement

ఇకపై దర్శకత్వం మీద కాన్సంట్రేట్ చేస్తా- శశి కుమార్

శశి కుమార్ హీరోగా తాజాగా ‘నందన్‌’ అనే సినిమా తెరకెక్కింది. ఎరా శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శశి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగానే ఆయన తన ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. "నాకు చాలా అప్పులు ఉన్నాయి. గత సంవత్సరం వరకు నేను ఆ అప్పులు తీర్చడం కోసమే సినిమాల్లో నటించాను. ఇప్పుడిప్పుడే అప్పుల బాధల నుంచి బయటపడుతున్నాను. ఇకపై దర్శకత్వం మీద దృష్టిపెట్టాలి అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.    

తెలుగు సినిమాలతోనూ అనుబంధం

శశి కుమార్ తమిళ సినిమా పరిశ్రమలో నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో ఆయన పలు సూపర్ హిట్ సినిమాలు చేశారు. కలర్స్ స్వాతి నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలో ఆయనే ఓ హీరో. దర్శక నిర్మాత కూడా ఆయనే. ఈ సినిమా తెలుగులో  తెలుగులో ‘అనంతపురం’ పేరుతో విడుదల అయింది. ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘శంభో శివ శంభో’ తమిళ ఒరిజినల్ వెర్షన్ లో ఆయనే హీరోగా నటించారు. తమిళంలో ‘నాడోడిగల్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ ను తెలుగులో రవితేజ చేశారు. అంతేకాదు, ‘శంభో శివ శంభో’ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. 2009లో విడుదలైన ‘నాడోడిగల్’కు సముద్రఖని దర్శకత్వం వహించగా మైఖేల్ రాయప్పన్ నిర్మించారు. తెలుగులోనూ ఈ సినిమాకు సముద్రఖనే దర్శకత్వం వహించారు. 

త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న ‘నందన్‌’

ఇక శశి కుమార్ హీరోగా, ఎరా శరవణన్ దర్శకత్వంలో తాజాగా ‘నందన్’ అనే సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుకను చెన్నైలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో శశి కుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొలుత ఈ సినిమాను తానే నిర్మించాలనుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అథితి పాత్రలో కనిపించాలినుకున్నానన్నారు. కానీ, చివరకు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో హీరోగా నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మూవీ కథ అద్భుతంగా ఉందన్న ఆయన, సినిమా ఇంకా బాగా వచ్చిందన్నారు. షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎక్కడా తలవంచుకుండా తెరకెక్కించినట్లు చెప్పారు. ఇక ఈ సినిమాలో శృతి పెరియస్వామి, మాధేష్‌, మిథున్‌, బాలాజీ శక్తివేల్‌, కొట్ట ఎరుంబు స్టాలిన్‌, సముద్రఖని, వి.ఙ్ఞానవేల్‌, జీఎం కుమార్‌ ఇతర పాత్రలో కనిపించారు. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకం, ఎరా ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. 

Also Read: ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌ - బీస్ట్‌ మోడ్‌లో గ్లోబల్‌ స్టార్‌, ఆర్‌సీ 16 లోడింగ్‌...

Continues below advertisement