ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని హీరో ఎన్టీఆర్ చేసిన మూవీ 'దేవర'. ఈ సినిమా హిట్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో... కొరటాల శివ కూడా అంత కంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఎందుకంటే... 'ఆచార్య' రిజల్ట్ విషయంలో కొరటాల శివ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. చిరంజీవి కూడా ఓ టైమ్ లో 'ఆచార్య' పూర్తిగా డైరెక్టర్ ఛాయిస్ అన్నారు. ఇప్పుడు 'దేవర' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ మాత్రం కొరటాలను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. సరైన ఆర్టిస్ట్ లు ఆయన చేతిలో పడితే అద్భుతాలు తీస్తారంటున్నారు. కొరటాల శివపై ఆచార్య మచ్చ తొలగిపోవాలంటే బాక్సాఫీస్ దగ్గర 'దేవర' గట్టిగా సౌండ్ చేయాలి.

  


'దేవర' మూవీ విషయంలో హీరో ఎన్టీఆర్ తోపాటు డైరెక్టర్ కొరటాల శివ, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చారు. సినిమా హిట్టా, సూపర్ హిట్టా, రికార్డులు బద్దలవుతాయా, కనీసం మ్యాచ్ చేస్తారా అనే విషయాల్లో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. అయితే దేవర రిజల్ట్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ కెరీర్ పై ఆ ప్రభావం మామూలుగానే ఉంటుంది. కానీ కొరటాల శివకు మాత్రం ఈ సినిమా ఘన విజయం సాధించడం చాలా కీలకం. ఎందుకంటే... ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని ఆయన ప్రకటించారు. గట్స్ తో సెకండ్ పార్ట్ గురించి చెప్పారు కాబట్టి ఫస్ట్ పార్ట్ ఆ అంచనాలను నిలబెట్టుకోవాలి. సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ అంతా వెయిట్ చేసేలా చేయాలి. అలా చేస్తేనే సెకండ్ పార్ట్ కి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా దేవర పార్ట్-2 గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. 



సాధారణంగా కొరటాల శివపై ఎలాంటి కంప్లయింట్ లు ఉండవు. ఆయన సినిమాలు దాదాపుగా అన్నీ హిట్లే. ఒకవేళ ఫ్లాప్ వచ్చిందనుకున్నా కొరటాల మేకింగ్ పై అందరికీ నమ్మకం ఉంటుంది. కానీ మధ్యలో వచ్చిన 'ఆచార్య' రిజల్ట్ కి కేవలం ఆయన ఒక్కరే కారణమా, లేక ఆ రిజల్ట్ కి హీరోలు కూడా ఒక కారణమా అనే సందేహం చాలామందిలో ఉంది. 'ఆచార్య' నేరేషన్ చూసి, కొరటాల ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే మెగాస్టార్ మాత్రం 'ఆచార్య' రిజల్ట్ వ్యవహారాన్ని పూర్తిగా  కొరటాలకే పరిమితం చేశారు. దీంతో కొరటాల స్టామినాకి నెక్స్ట్ మూవీ 'దేవర' అగ్ని పరీక్షలా మారింది.



'దేవర' విషయంలో ఎన్టీఆర్ ఎక్కడా కొరటాలపై ఒత్తిడి తెచ్చారని అనుకోలేం. అదే సమయంలో డైరెక్టర్ కూడా సినిమా స్కోప్ పెరిగిందని రెండు పార్ట్ లు గా తీస్తానని కాస్త ముందుగానే ప్రకటించారు. సో సినిమా డ్యూరేషన్ లో కూడా ఆయన రాజీ పడ్డారని అనుకోలేం. ఫస్ట్ పార్ట్ ఏకంగా 3 గంటలు వచ్చేసింది. ఇక బాలీవుడ్ అట్రాక్షన్ కోసం హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్ సైఫ్ అలీ ఖాన్ ఉండనే ఉన్నారు. ఇంతమంది బడా స్టార్స్ ని, టెక్నీషియన్స్ ని, భారీ బడ్జెట్ ని పెట్టుకుని కొరటాల ఏం తీశారు, ఎలా తీశారనేదే అసలు ప్రశ్న.


Also Read: హాలీవుడ్‌ రేంజ్‌లో 'దేవర'... ఒక్క ఫైట్‌కు 10 నైట్స్‌ - సైఫ్ మాటలు వింటే గూస్ బంప్స్ గ్యారంటీ


'ఆచార్య'లో లాగా చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరికీ స్క్రీన్ షేర్ చేయాలి, పార్లల్ గా సీన్లు రాసుకోవాలనే రిస్క్ దేవరలో లేదు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కాబట్టి ఎవరికెంత స్కోప్ ఇచ్చినా ఫ్యాన్స్ ఫీలయ్యేది ఏమీ ఉండదు. అయితే ఆయన్ని ఎంత ఫెరోషియస్ గా చూపించారనేదే ఇక్కడ ప్రశ్న. ఈ దేవర మూవీ కొరటాలకు పెద్ద పరీక్షలా మారింది. మరి ఈ పరీక్షలో ఆయన డిస్టింక్షన్ లో పాసవుతారా, లేదా అనేది ఈనెల 27న తేలిపోతుంది. 


Also Read: అండర్ వాటర్ సీక్వెన్స్ నుంచి అనిరుద్ మ్యూజిక్ వరకు - 'దేవర' టీమ్ ఇంటర్వ్యూలో హైలైట్స్