Devara Team Interaction With Sandeep Reddy Vanga: దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో దేవర హీరో ఎన్టీఆర్ విలన్ సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ జాహ్న కపూర్ దర్శకుడు కొరటాల శివ ఇంటరాక్ట్ అయ్యారు. ఆ ఇంటర్వ్యూలో హైలైట్స్ ఒకసారి చూడండి.
- దేవర యాక్షన్ డ్రామా అని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. 'బాహుబలి', 'కల్కి 2898 ఏడీ' సినిమాలలో ప్రత్యేక ప్రపంచాలను క్రియేట్ చేశారని, అదే విధంగా 'దేవర' కూడా ఒక డిఫరెంట్ వరల్డ్ అని ఆయన తెలిపారు. సినిమా మొదలైన 15 నిమిషాలకు ప్రేక్షకులందరూ ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతారని ఎన్టీఆర్ చెప్పారు.
- 'దేవర' ట్రైలర్ చూస్తే షార్క్ సీన్ చాలా మందికి సర్ప్రైజ్. నీళ్లలో నుంచి ఎన్టీఆర్ పైకి రావడం, షార్క్ మీద సవారి చేయడం కొత్త సీన్లు. ఆ యాక్షన్స్ సన్నివేశాల కోసం హైదరాబాద్ స్టూడియోలో ప్రత్యేకంగా ఒక సెట్ వేసామని ఎన్టీఆర్ తెలిపారు. ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ లో 35 రోజులు పాటు చిత్రీకరించినట్లు ఆయన వివరించారు. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ బోట్స్ ప్రత్యేకంగా తయారు చేశారని కొరటాల శివ చెప్పారు.
- యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ అందించిన మ్యూజిక్ 'దేవర' సినిమాకు ప్లస్ అవుతుందని ఎన్టీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. సినిమాను అర్థం చేసుకుని అతను సంగీతం అందిస్తాడని, 'దేవర' సినిమాకు అనిరుద్ అందించిన సంగీతం ఏ ఇంటర్నేషనల్ సినిమాకు తీసుకొని రీతిలో ఉంటుందని ఎన్టీఆర్ చెప్పారు. ఏదో ఒక రోజు ఇంటర్నేషనల్ (హాలీవుడ్) సినిమాలకు అనిరుద్ సంగీతం అందిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
- 'స్పిరిట్'కు ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు 'దేవర' రన్ టైమ్ గురించి అడిగినప్పుడు 'యానిమల్' రన్ టైమ్ ఎంత? ఈ ప్రశ్న అడగటానికి అర్హత లేదని సందీప్ రెడ్డి వంగాతో సరదాగా వ్యాఖ్యానించారు ఎన్టీఆర్.
- 'దేవర'లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారనేది అందరికీ తెలుసు. ఓ క్యారెక్టర్ తండ్రి అయితే... మరొక క్యారెక్టర్ కొడుకు. ఇంటర్వ్యూలో నాలుగు గ్రామాల మధ్య కథ జరుగుతుందని, తమ పూర్వీకుల ఆయుధాలకు, గ్రామ దేవతలకు ఊరి ప్రజలందరూ పూజలు చేస్తారని, ఆయుధాల కోసం వాళ్ళ మధ్య ఎటువంటి పోరు జరిగిందనేది కథ అని ఎన్టీఆర్ చెప్పారు. అయితే సినిమాలో మరొక విషయం ఉందని, అది రివీల్ అయినప్పుడు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
- 'దేవర' సినిమాలో నటించినదుకు తనకు చాలా సంతోషంగా ఉందని హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ముంబైలో ఆర్టిస్టులు అందరూ సౌత్ సినిమాలలో నటించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు. దేవరలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం సుమారు పది రోజుల పాటు రాత్రి వేళల్లో చిత్రీకరణ చేశామని ఆయన వివరించారు.
- 'దేవర' సినిమాలో అన్ని పాత్రల కంటే జాన్వీ కపూర్ పాత్ర రాయడం తనకు చాలా కష్టమైందని కొరటాల శివ చెప్పారు. సినిమాలో మహిళల పాత్రలు చాలా బలంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. జాన్వీ కపూర్ ప్రతి రోజు డైలాగ్స్ కోసం తనకు మెసేజ్ లు చేసేదని ఆయన చెప్పుకొచ్చారు.
- జాన్వీ కపూర్ తెలుగు డైలాగులు చెప్పడం చూసి తామంతా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసామని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ముంబై అమ్మాయి తెలుగులో డైలాగులు ఎలా చెప్పిందో తనకు అర్థం కాలేదని, మొదటిరోజు చిత్రీకరణ అయ్యాక కొరటాల సూపర్ అన్నారని ఆయన వివరించారు. 'దేవర' చిత్రీకరణలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తనను టేప్ రికార్డర్ అనేవారని జాన్వీ కపూర్ సరదాగా వివరించారు.